ప్రధాని మోడీ థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్నారు. బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యారు. ఈ సదస్సులో భారత్‌తో పాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్ దేశాల అధినేతలు పాల్గొన్నారు.
ఇక గురువారం బ్యాంకాక్‌లో థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ప్రధాని మోడీ పక్కనే బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత యూనస్ కూర్చుకున్నారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయాక.. యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి భారత్‌తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోడీ-యూనస్ పక్కపక్కన కూర్చోవడం ఆసక్తి రేపుతోంది. ఈ ఫొటోలను యూనస్ కార్యాలయం విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: Gujarat: కన్నీళ్లు తెప్పిస్తున్న జెట్ పైలట్ మృతి.. వారం క్రితమే నిశ్చితార్థం.. ఇంతలో విషాదం
ఇక ప్రధాని మోడీ శుక్రవారం బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా మూడు కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ అధినేత ముహమ్మద్ యూనస్‌తో తొలి అధికారిక సమావేశం ఉండే అవకాశం ఉంది. అలాగే నేపాల్ ప్రధాన మంత్రి కేపీ.శర్మ ఓలి, మయన్మా్ర్ అధికారులతో మోడీ సమావేశం కానున్నారు.
ఇది కూడా చదవండి: Wedding Anniversary: ఘోరం.. పెళ్లిరోజున భార్యతో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి