PM Modi: ఈ రోజు (ఫిబ్రవరి 17) తెల్లవారు జామున దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో సంభవించిన స్వల్ప భూ ప్రకంపనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. ఏ ఒక్కరూ కూడా ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దు.. అందరు ప్రశాంతంగా ఉండాలని ఆయన సూచించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం అవుతోంది. బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పేరును ప్రకటించలేదు. దీంతో ఆశావాహులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎవరికీ ఢిల్లీ పీఠం దక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చే మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ కాలం మూడు రోజుల్లో పూర్తవుతుంది. దీంతో కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరన్నది ఆసక్తి రేపుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారమంతా భారీ నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు.. దానికి తోడుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది.
Elon Musk's gift to PM Modi: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ముగిసింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ భేటీకి ముందు, ట్రంప్‌కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న బిలియనీర్ ఎలాన్ మస్క్‌తో ప్రధాని భేటీ అయ్యారు.
భారత్‌కి ట్రంప్ ‘‘F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్’’ ఆఫర్ చేశారు. ప్రపంచంలో ఉన్న యుద్ధవిమానాల్లో F-35 అత్యంత అడ్వాన్సుడ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన యుద్ధవిమానంగా పేరుంది. ఈ ఉంటే శత్రుదేశాలు హడలి చావాల్సిందే. ‘‘మేము భారతదేశానికి సైనిక అమ్మకాలను అనేక బిలియన్ డాలర్లకు పెంచుతాము. చివరికి భారతదేశానికి F-35 స్టీల్త్ ఫైటర్లను అందించడానికి కూడా మేము మార్గం సుగమం చేస్తున్నాము’’ అని ట్రంప్ స్యంగా ప్రకటించారు.
PM Modi: అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ సమయంలో ఆయన మాట్లాడుతూ.. యూఎస్‌లో అక్రమంగా ఉంటున్న తమ పౌరుల్ని భారత్ తిరిగి స్వీకరింస్తుందని చెప్పారు. అదే సమయంలో మానవ అక్రమ రవాణాని అంతం చేయడానికి ప్రయత్నాలు అవసరమని చెప్పారు.
PM Modi: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. వైట్ హౌజ్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల గురించి చర్చించారు. ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇదిలా ఉంటే, ట్రంప్‌తో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో, ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్(MIGA)’ అని అన్నారు. ట్రంప్ అమెరికాని ‘‘మేక్ అమెరికా…
Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రదాడుల్లో నిందితుడిగా ఉన్న తహవ్వూర్ రాణాని భారత్‌కి అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. వైట్ హౌస్‌లో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.