Donald Trump: భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి అమెరికా నిధులను ఉపయోగించిందని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లను యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (USAID) అందించినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలు దేశంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య అగ్గిరాజేశాయి. యూఎస్ఎయిడ్ నిధుల్ని కాంగ్రెస్, దాని ఎకోసిస్టమ్ వాడుకుందని బీజేపీ కాంగ్రెస్పై ఆరోపణలు గుప్పించింది.
PM Kisan: పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని మోడీ ఈ పథకం కింద 19వ విడతగా మొత్తం రూ.22వేల కోట్లను రేపు (ఫిబ్రవరి 24) విడుదల చేయనున్నారు. బీహార్లోని భాగల్పూర్లో జరగనున్న ఒక కార్యక్రమంలో ప్రధాని ఈ నిధులను రిలీజ్ చేస్తారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన విషయం విదితమే కాగా.. ఆ ప్రమాదంపై ఆరా తీశారు ప్రధాని.. ఇక, జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోడీకి ఫోన్లో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.. ఎస్ఎల్బీసీ సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని తెలిపారు తెలంగాణ సీఎం..
Shaktikanta Das: ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ని ప్రభుత్వం శనివారం నియమించింది. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన నియామకం అమలులోకి వస్తుందని క్యాబినెట్ నియామకాల కమిటీ ఒక ఉత్తర్వులో పేర్కొంది
Mangalyaan-2: ‘‘మంగళయాన్’’ ఇస్రో చరిత్రలో ఘన విజయంగా చెప్పొచ్చు. దేశ సైన్స్ అండ్ టెక్నాలజీలను ప్రపంచానికి చాటి చెప్పిన ప్రయోగంగా భారతీయ అంతరిక్ష చరిత్రలో నిలిచిపోయింది. హాలీవుడ్ సినిమా ‘‘గ్రావిటీ’’ బడ్జెట్ కన్నా అతి తక్కువ బడ్జెట్తో మనం అంగారక గ్రహాన్ని చేరడాన్ని ప్రపంచ దేశాలు కొనియాడాయి.
ప్రధాని మోడీని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కలిశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల తర్వాత రేఖ గుప్తా శనివారం మోడీని కలిశారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కర్ను కూడా ముఖ్యమంత్రి కలిశారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది.
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. మార్చి నెలలో మారిషస్లో పర్యటించనున్నారు. మార్చి 12న మారిషస్ 57వ స్వాతంత్ర్య దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవ అతిథిగా హాజరవుతారని మారిషస్ ప్రధాని నవీన్ రామ్గూలమ్ వెల్లడించారు.
Chhaava: ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు, మరాఠా పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘‘ఛావా’’ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. రికార్డు స్థాయి వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. విక్కీ కౌశల్ లీడ్ రోల్లో శంభాజీ క్యారెక్టర్లో జీవించారు.
PM Modi: ‘‘హిందీ’’ వివాదంపై కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్, రూలింగ్ పార్టీ డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ‘‘భాషా ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండాలి’ అని సూచించారు.
భారత ప్రధాని మోడీ తనకు పెద్దన్న లాంటివారని భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ను మోడీ ప్రారంభించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కలిసి ఈ సదస్సు ప్రారంభించారు.