PM Modi: మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోడీ శ్రీలంక చేరుకున్నారు. శుక్రవారం కొలంబోలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారత్, శ్రీలంక మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రక్షణ, ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, వాణిజ్య రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. గతేడాది వామపక్ష కూటమికి చెందిన అనుర కుమార దిస్సనాయకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా శ్రీలంకలో పర్యటిస్తున్నారు.
Read Also: Off The Record : కేతిరెడ్డి నెంబర్ వచ్చిందా..Farm House కోసం 20 ఎకరాల చెరువును మింగేశారా ?
థాయ్‌లాండ్‌లో జరిగిన బిమ్‌స్టెక్ సమావేశం అనంతరం ప్రధాని మోడీ నేరుగా శ్రీలంక చేరుకున్నారు. గత డిసెంబర్ లో దిస్సనాయకే న్యూఢిల్లీ పర్యటకు వచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశీ పర్యటన భారత పర్యటన. ప్రధాని మోడీ పర్యనటలో 8 అవగాహన ఒప్పందాలపై సంతకం చేయాలని భావిస్తున్నారు. ద్వీప దేశానికి చౌకైన ఇంధన సరఫరాతో సహా ఆరోగ్యం, రక్షణ, ఇంధన రంగాల్లో సహకరించేలా ఈ ఒప్పందాలు ఉండబోతున్నాయి.
ఈ పర్యటనకు ప్రధాని మోడీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఉన్నారు. శనివారం ప్రధాని మోడీ కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్‌లో గౌరవ వందనం స్వీకరించనున్నారు, ఆ తర్వాత అధ్యక్ష సచివాలయంలో అధ్యక్షుడు దిస్సనాయకేతో అధికారిక చర్చలు జరుగుతాయి.