అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగానే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో మీడియా సమావేశంలో సుంకాలు వెల్లడించారు. అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా భవిష్యత్ అమెరికన్ల చేతుల్లోనే ఉందని తెలిపారు. ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నా.. తాము మాత్రం సగమే విధిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశాలపై ఉన్న ప్రేమతోనే సగం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇండియాపై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు వెల్లడించారు. తనకు మోడీ గొప్ప స్నేహితుడని.. అయితే భారత్.. అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని పేర్కొన్నారు.
ఇక చైనాపై 34 శాతం సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. యూఎస్‌కు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారని.. తమ ట్యాక్స్ పేయర్లను గత 50 ఏళ్లుగా దోచుకున్నారని పేర్కొన్నారు. ఇకపై అలా జరగదని.. మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు.
సుంకాలు ఈ విధంగా..
భారత్: 26 శాతం
పాకిస్థాన్: 29 శాతం
శ్రీలంక: 44 శాతం
బంగ్లాదేశ్: 37 శాతం
చైనా: 34 శాతం
ఇజ్రాయెల్: 17 శాతం
థాయిలాండ్: 36 శాతం
సింగపూర్: 10 శాతం
యూకే: 10 శాతం
బ్రెజిల్: 10 శాతం
చిలి: 10 శాతం
ఆస్ట్రేలియా: 10 శాతం
టర్కీ: 10 శాతం
కొలంబియా: 10 శాతం
పిలిఫ్ఫీన్స్: 17 శాతం
ఈయూ: 20 శాతం
ఇండోనేషియా: 32 శాతం
తైవాన్: 32 శాతం
జపాన్: 24 శాతం
దక్షిణ కొరియా: 25 శాతం
స్విట్జర్లాండ్: 31 శాతం
మలేషియా: 24 శాతం
కంబోడియా: 49 శాతం
దక్షిణాఫ్రికా: 30 శాతం