TDP-JDU: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే గెలుపుతో మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. 2014, 2019లో కాకుండా ఈ సారి మ్యాజిక్ఫిగర్(272)ని బీజేపీ స్వతహాగా సాధించలేకపోయింది.
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్పోర్టులో ఆమెకు భారీ ఘన స్వాగతం లభించింది. మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు
Devendra Fadnavis: మహారాష్ట్రలో బీజేపీ దారుణ ప్రదర్శనకు తాను బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల చెప్పారు. అయితే, అమిత్ షాతో పాటు ఇతర బీజేపీ అగ్రనాయకత్వం వారించడంతో ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గారు.
ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఉన్న కీలకమైన మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. నితీష్ కుమార్ జేడీయూ పార్టీకి రెండు కేబినెట్ బెర్తుల్ని కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ వేడుక రేపు (జూన్ 9) రాత్రి 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరగబోతుంది. ప్రధానితో పాటే కొత్త మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి మొదలుకుని విదేశీ అతిథులు హాజరుకాబోతున్నారు.
కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరకూ ఎలాంటి అనుమానం లేదు.. కానీ ఆ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ఎన్నాళ్లు నడుపుతారు అనేది మాత్రం ఊహించలేమని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చెప్పుకొచ్చారు.
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు రావు కన్నుమూతపై సంతాపం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్న ఆయన.. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని గుర్తుచేశారు.. పత్రికారంగంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు.. పత్రిక, సినీ, వ్యాపార రంగాలపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత్ ఆహ్వానాన్ని ముయిజ్జూ స్వీకరించినట్లు అక్కడి మీడియా తెలిపింది.
Pakistan : దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వరుసగా మూడోసారి విజయం సాధించడంతో నరేంద్ర మోడీ భారత ప్రధాని కాబోతున్నారు. ఆ తర్వాత పాకిస్థాన్ నుంచి ఓ వ్యాఖ్య వచ్చింది.