Rahul Gandhi: ప్రతిపక్ష స్వరాన్ని అనుమతించండి.. రాజ్యాంగాన్ని రక్షిస్తారని మా నమ్మకం..
- స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక..
- ప్రతిపక్ష స్వరాన్ని అనుమతించాలి..
- రాజ్యాంగాన్ని రక్షించడం మీ బాధ్యత..
- పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు. ఈ రోజు జరిగిన స్పీకర్ ఎన్నికల్లో మూజువాణి ఓటులో ఓం బిర్లా గెలుపొందారు. కోటా నుంచి మూడుసార్లు వరసగా ఎన్నికైన ఓం బిర్లా, గత పార్లమెంట్‌లో కూడా స్పీకర్ బాధ్యతలు చేపట్టారు, వరసగా రెండోసారి స్పీకర్ అయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు కలిసి ఓం బిర్లాను స్పీకర్ చైర్ వరకు తీసుకెళ్లారు.
Read Also: Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన సీబీఐ..
Also Read
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. లోక్‌సభ స్పీకర్ ప్రజల గొంతుకకు మధ్యవర్తి అని, గతం కన్నా ఈ సారి ప్రతిపక్ష ఆ స్వరానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ఆయన అననారు. ప్రతిపక్షాలు స్పీకర్ పని చేయడంలో సహకరిస్తాయని, సభ పనిచేయాలని కోరుకుంటున్నామని అన్నారు. సభలో ప్రతిపక్షాల స్వరాన్ని అనుమతించాలని అన్నారు. ‘‘మీరు మమ్మల్ని మాట్లాడేందుకు అనుమతిస్తారనే నమ్మకం ఉంది. ససభను ఎంత సమర్ధవంతంగా నడిపిస్తున్నారనేది ప్రశ్న కాదు. భారతదేశం యొక్క వాణిని ఎంతవరకు వినిపించడానికి అనుమతిస్తున్నారన్నది ప్రశ్న. ప్రతిపక్షాల స్వరాన్ని సైలెంట్ చేయడమనేది అప్రజాస్వామిక ఆలోచన. ఈ ఎన్నికల ద్వారా రాజ్యాంగాన్ని రక్షించాలని ప్రజలు తీర్పు ఇచ్చారు’’ అని అన్నారు. ప్రతిపక్షాలను మాట్లాడటానికి అనుమతించడం ద్వారా, రాజ్యాంగాన్ని రక్షించే మీ కర్తవ్యాన్ని మీరు చేస్తారనే నమ్మకం ఉందని రాహుల్ గాంధీ అన్నారు.
#WATCH | Leader of Opposition, Rahul Gandhi says "I would like to congratulate you for your successful election that you have been elected for the second time. I would like to congratulate you on behalf of the entire Opposition and the INDIA alliance. This House represents the… pic.twitter.com/vZbLrKV7u5
— ANI (@ANI) June 26, 2024
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!