సార్వత్రిక ఎన్నికల్లో కేరళ నుంచి గెలిచిన ఒకే ఒక్కడైన బీజేపీ ఎంపీ, నటుడు సురేష్ గోపికి అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి దక్కింది. కేరళలో త్రిసూర్ పార్లమెంట్ నుంచి ఎన్నికైన మొదటి బీజేపీ ఎంపీ సురేషే. సీపీఐ అభ్యర్థి సునీల్ కుమార్పై విజయం సాధించారు.
ఢిల్లీలో పీఎంవోలో ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం సిబ్బందితో మోడీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మోడీ పలు కీలక సూచనలు చేశారు
కచ్చతీవు ద్వీపం అంశం మరోసారి వార్తల్లోకెక్కింది. ఇప్పుడు ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. దీని వల్ల శ్రీలంకతో భారత్ సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉందని సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు.
నరేంద్ర మోడీ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే కూలిపోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ జోస్యం చెప్పుకొచ్చారు.
ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రధాని నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం సమావేశం కాబోతుంది. ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపుపై ఓ క్లారిటీ రానుంది.
భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. మోడీతో పాటు మరో 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసేశారు. అయితే, మోడీ3.0 మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు చోటు కల్పించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ముచ్చటగా మూడోసారి మోడీ 3.0 సర్కార్ కొలువుదీరింది. మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రెండో ప్రధానమంత్రిగా మోడీ రికార్ట్ సృష్టించారు.
Ravneet Singh Bittu: ముచ్చటగా మూడోసారి నరేంద్రమోడీ ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరింది. ఈ రోజు వరసగా మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేశారు. మోడీతో సహా 72 మందితో కేబినెట్ కొలువుదీరింది.
కేంద్ర మంత్రి పదవి లభించడం పట్ల బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఈరోజు చాలా ఆనందంగా ఉందని.. తనపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
PM Modi: ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మోడీతో పాటు కేంద్రమంత్రులుగా 72 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు.