Drugs Party: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. ఈ ఐదుగురికి డ్రగ్ టెస్ట్ పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Party at Former MLA Pilot Rohith Reddy’s Farmhouse: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది.. పక్కా సమాచారంతో పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించారు. ఈగల్ టీమ్ అధికారులు ఫామ్‌హౌస్‌పై ఆకస్మిక దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సైతం ఉన్నారు.. పోలీసులు రాగానే రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిద్ మిశ్రా ఫైరింగ్ ప్రారంభించాడు.. పోలీసులను భయపెట్టడానికి కాల్పులు జరిపాడు. నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపాడు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. తుపాకీ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. ఇక ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందరికీ డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ డ్రగ్ టెస్టులో ఐదుగురికి పాజిటివ్ రాగా.. ఎంపీ పుట్టా మహేష్‌కి మాత్రం నెగెటివ్ వచ్చింది.. పైలట్ రోహిత్, రితేష్ రెడ్డి, నమిద్ మిశ్రా, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది.. పార్టీలో పట్టుబడిన 10 మందిలో ఓ మహిళ సైతం ఉంది.. కౌశిక్ రవితో కలిసి ఆ మహిళ వచ్చింది. డ్రగ్స్‌తో పాటు ఫామ్ హౌస్ లోపల ఖరీదైన మద్యం బాటిళ్లు, హుక్కా పైప్స్ సైతం దొరికాయి. పాజిటివ్ వచ్చిన వాళ్లలో కొందరు వారం కిందట సిమ్లా నుంచి వచ్చామని చెబుతున్నారు.. మరికొందరి గోవా నుంచి వచ్చామని చెబుతున్నారు.. అందరి బ్లెడ్ శాంపిల్స్‌ను ఫోరెనిక్స్ ల్యాబ్‌కి పంపించినట్లు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు.
READ MORE: Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!