కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమై మద్దతు ధరను నిర్ణయించే అంశాన్ని లేవనెత్తుతానని వెల్లడించారు. ఉత్తర మహారాష్ట్రలో ప్రధాన ఉత్పత్తి ఉల్లి.. వీటి కారణంగానే తాము సమస్యలను ఎదుర్కొన్నామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఈ అంశమే మమ్మల్ని బాగా ఏడిపించిందని సీఎం షిండే కామెంట్స్ చేశారు.
ఒడిశాలో తొలిసారి అధికారం దక్కించుకున్న కమలం పార్టీ గిరిజన నేతకు ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇచ్చింది. కియోంజర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన మోహన్ చరణ్ మాఝీ ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఆదివారం మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్డీఏ పక్షాలకు ఆయా శాఖలు దక్కాయి. ఇక బీజేపీ కేంద్రమంత్రులకు పాత శాఖలే దక్కాయి. ఇక తాజాగా ప్రధాని మోడీ తన సోషల్ మీడియా ఖాతాల్లో మార్పులు చేశారు.
China: భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సరైన దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు న్యూఢిల్లీలో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజింగ్ తెలిపింది. మూడోసారి ఎన్నికైన ప్రధాని నరేంద్రమోడీకి చైనా ప్రధాని లీ కియాంగ్ మంగళవారం అభినందనలు తెలియజేశారు.
Rahul Gandhi: తన సోదరి ప్రియాంకాగాంధీ వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే ప్రధాని నరేంద్రమోడీని రెండు నుంచి మూడు లక్షల ఓట్లతో ఓడించేవారని మంగళవారం రాహుల్ గాంధీ అన్నారు.
Odisha Swearing-In: ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇప్పటికే కొత్త ముఖ్యమంత్రి పేరు ఖారరైంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
ఈనెల 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. రెండ్రోజుల పాటు ఎంపీల ప్రమాణస్వీకారం ఉండనుంది. 24, 25 తేదీల్లో ఎంపీలంతా ప్రమాణం చేయనున్నారు. ఇదిలా ఉంటే కొత్త ఎంపిక జరిగేంత వరకు ప్రొటెం స్పీకర్ ఉండనున్నారు.
ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఆయనతో పాటు.. ఈ కార్యక్రమంలో తమిళనాడు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ గీతాలక్ష్మి, కొండాలక్ష్మణ్ యునివర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు.
విమానయాన శాఖ మంత్రిగా పని చేసిన జ్యోతిరాధిత్య సింధియాను కలిసి ఆయన అనుభవాలను తెలుసుకుంటాను.. మంత్రిని బట్టి శాఖ పని తీరు ఉంటుందని అనేక మంది చెబుతున్నారు.. అందుకు తగ్గట్టే పౌర విమానయాన శాఖను డ్రైవ్ చేస్తాను అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.