పార్లమెంట్‌లో ప్రధాని మోడీని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మనవరాళ్లు కలిశారు. ఇద్దరు చిన్నారులు బుధవరం పార్లమెంట్‌లోని మోడీ కార్యాలయానికి వెళ్లి కలిశారు. లిలక్ ఫ్రాక్స్ డ్రస్‌లో ఉన్న ఇద్దరు చిన్నారులు… ప్రధాని మోడీకి దేశభక్తి గీతంతో స్వాగతం పలికారు. చిన్నారుల పాటకు మురిసిన మోడీ నవ్వారు.. అనంతరం ఇద్దర్ని దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దత్తాత్రేయ.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి.. కేంద్రమంత్రిగా మోడీ సర్కార్‌లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన హర్యానా గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. ఇక ప్రతి ఏడాది హైదరాబాద్‌లో అన్ని పార్టీల వారిని ఆహ్వానించి అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తుంటారు.
#WATCH | Prime Minister Narendra Modi receives two special visitors at his office today in Parliament. pic.twitter.com/mMgRBKlakB
— ANI (@ANI) June 26, 2024