Lok Sabha Speaker Election: స్పీకర్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్..! ఎన్డీఏకు వైసీపీ మద్దతు
- లోక్‌సభ స్పీకర్ ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు..
- తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైసీపీని కోరిన బీజేపీ..
- సానుకూలంగా స్పందించింది వైసీపీ..
- వైసీపీ సభ్యుల సపోర్ట్‌తో 297కు పెరిగిన ఎన్డీఏ బలం ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Speaker Election: లోక్‌సభ స్పీకర్ ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరింది భారతీయ జనతా పార్టీ.. దీనిపై సానుకూలంగా స్పందించింది వైసీపీ.. అయితే, లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.. దీంతో, ఎన్డీఏ అభ్యర్థికి మరింత బలం పెరిగింది.. వైసీపీకి లోక్‌సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు.. ఎన్డీఏకు ఇప్పటికే 293 సభ్యుల బలం ఉంది.. వైసీపీ సభ్యుల సపోర్ట్‌తో ఎన్డీఏ బలం 297కు పెరిగినట్టు అయ్యింది.
Read Also: Kidney Stones : కిడ్నీలో రాళ్లున్నాయా..? అయితే ఇలా చెక్ చెప్పండి..
Also Read
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
కాగా, అటు ఎన్డీఏ.. ఇటు ఇండియా కూటమిలో లేకుండా తటస్థంగా ఉంది వైసీపీ.. ఇప్పుడు స్పీకర్ ఎన్నిక విషయంలో అనూహ్యంగా ఎన్డీఏకు బయటి నుంచే మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది..ఈ పరిణామం.. జాతీయ రాజకీయాల్లోనే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లోనూ ఆసక్తికరంగా ఉంది.. ఎన్డీఏ కూటమిలో బీజేపీ బలం 240 స్థానాలు మాత్రమే.. మ్యాజిక్ ఫిగర్ 272కి 32 స్థానాలు తక్కువగా ఉన్నాయి.. దీంతో.. టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లు కలుపుకుంటేనే ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ దక్కుతుంది. అయితే, స్పీకర్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎత్తుగడలు వేస్తుండడంతో.. అత్యంత అప్రమత్తం అయ్యింది బీజేపీ.. ఎందుకైనా మంచిది అంటూ.. వైసీపీ లాంటి తటస్థ పార్టీల మద్దతు అడుగుతుంది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలన్న సాంప్రదాయంలో భాగంగా అన్ని పార్టీల మద్దతు కోరడం ఆనవాయితీ.. ఇందులో భాగంగానే వైసీపీ మద్దతు అడిగింది బీజేపీ.. అయితే, ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో.. వైసీపీ మద్దతు ఎవరికి? అనే సస్పెన్స్ కొనసాగింది.. కానీ, ఆ ఉత్కంఠకు తెరదించిన వైసీపీ.. ఎన్డీఏకు మద్దతు ప్రకటించింది.. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలన్న ఉద్దేశంతోనే వైసీపీ మద్దతు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. కాగా, రేపు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!