OTT Movies : ఈ వీకెండ్ డిజిటల్ తెరపై సినీ జాతర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేట్రికల్ మూవీస్ ఇంట్రస్టింగ్‌గా లేవు.. ఓటీటీ సినిమాలతో సరిపెట్టుకుందాం అనుకునే వారికి ఈ వీకెండ్ బెస్ట్ ఛాయిస్. ఎందుకంటే సంక్రాంతి నుండి రీసెంట్లీ రిలీజైన చాలా సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌లోకి వచ్చేశాయి. సంక్రాంతికి పోటీ ఉన్నా కూడా బరిలోకి దిగిన రవితేజ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి.. రెండు నెలల గ్యాప్ తర్వాత జీ5లో సందడి చేస్తోంది. విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిషన్ హీరోగా నటించిన బూకీ కూడా ఇదే ఓటీటీలో ప్రీమియర్ అవుతోంది. ఇందులో మంచు లక్ష్మీ, సునీల్ కీ రోల్స్ చేసిన సంగతి విదితమే. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ ఈ మూవీని విడుదల చేసింది.
ఫిబ్రవరిలో కాస్తో కూస్తో అంచనాలతో దిగిన ఫంకీ బాగా డిజప్పాయింట్ చేసింది. జస్ట్ ఫన్ మాత్రమే అదీ కూడా పోర్ష్ కామెడీ ట్రాక్ , కథ లేదన్న నెగిటివ్ రివ్యూస్‌తో సినిమా బొక్కా బోర్లా పడింది. కెవి అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, కయాద్ లోహార్ జంటగా నటించిన ఈ ఫిల్మ్ ఫిబ్రవరి 13న రిలీజ్ కాగా, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. ఇక అదే రోజు రిలీజై పాజిటివ్ టాక్‌తో హిట్ కొట్టిన కపుల్ ఫ్రెండ్లీ అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేస్తోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి కెమిస్ట్రీకి తోడు ప్రభాస్ ఇంటర్వ్యూ ఈ సినిమా వసూళ్లకు తోడ్పడ్డాయి. చివరకు ఫిబ్రవరి విన్నర్‌గా నిలిచింది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అనుపమ పరమేశ్వరన్ రీసెంట్లీ తమిళంలో లాక్ డౌన్ అనే ఫిల్మ్‌తో పలకరిచింది. ఈ మధ్య కాలంలో ఈ సినిమా పడినన్నీ వాయిదాలు మరో మూవీ పడలేదనే చెప్పొచ్చు. ఈ మూవీ వచ్చి వెళ్లిందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ప్రమోషన్స్ లేకుండా వచ్చి సైలెంట్‌గా సైడయ్యింది. అలాగే సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసింది. మార్చి 11 నుండే అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేస్తోంది. నాగార్జున 100వ సినిమాను డీల్ చేస్తున్న రా కార్తీక్ తెరకెక్కించిన కొరియా- ఇండియన్ డ్రామా మేడిన్ కొరియా కూడా నెట్ ఫ్లిక్స్‌లో 12 నుండి స్ట్రీమ్ అవుతోంది. ప్రియాంక అరుళ్ మోహన్ లీడ్ రోల్‌లో నటించింది.
మలయాళంలో రిలీజై మంచి వ్యూస్ దక్కించుకొన్న పెన్నుమ్ పోరాట్టమ్ ఈ శుక్రవారం నుండే నెట్ ఫ్లిక్స్‌లో సందడి చేస్తోంది. శివ కందుకూరి, తేజు అశ్వినీ కీ రోల్స్ లో నటించిన నవాబ్ కేఫ్ ఈటీవి విన్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఛాయ్ వాలాగా తెరకెక్కిన ఈ ఫిల్మ్ టైటిల్ విషయంలో సెన్సార్ అబ్జెక్షన్ పెట్టడంతో నవాబ్ కేఫ్‌గా మారి విడుదలైంది. పరేశ్ రావల్ కీ రోల్ పోషించిన ది తాజ్ స్టోరీ లయన్స్‌గేట్‌ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!