Champions Trophy 2025: కాస్త ఓపిక పట్టండి.. ఏం జరుగుతుందో చూస్తారు: పీసీబీ చీఫ్
- ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో సందిగ్థత
- ఐసీసీ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకోవడం లేదు
- త్వరలో ఐసీసీ షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో సందిగ్థత వీడడం లేదు. ఓవైపు ఆతిథ్యం విషయంలో పాకిస్థాన్ మొండిగా ఉండగా.. మరోవైపు పాక్‌కు వెళ్లి ఆడేందుకు భారత్ సిద్ధంగా లేదు. టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తేనే పాల్గొంటామని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పగా.. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని పీసీబీని అంతర్జాతీయ క్రికెట్ మండలి కోరింది. ఈ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకోవడం లేదు. సోమవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆధునీకీకరణ పనులను పరిశీలించిన పీసీబీ ఛైర్మన్ మొహసీన్ నఖ్వీ మీడియాతో మాట్లాడారు.
పాకిస్థాన్‌లో పర్యటించకపోవడానికి గల కారణాలను బీసీసీఐ వివరించాలని తాము ఐసీసీకి లేఖ రాశామని మొహసీన్ నఖ్వీ చెప్పారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అర్హత సాధించిన ప్రతి టీమ్ పాకిస్థాన్‌కు వచ్చేందుకు రెడీగా ఉంది. భద్రత విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత్‌కు ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. మేం వారితో చర్చించి పరిష్కరిస్తాం. క్రీడలు, రాజకీయాలు వేరు. క్రీడలను రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు. అంతా బాగానే జరుగుందని ఆశిస్తున్నాము. ఐసీసీ త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది’ అని నఖ్వీ తెలిపారు.
Also Read
ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాల్సి వస్తే పాకిస్తాన్ టోర్నీ నుంచి వైదొలుగుతుందా? అన్న ప్రశ్నకు మొహసీన్ నఖ్వీ సమాధానం ఇచ్చారు. ‘పాకిస్థాన్ గౌరవం అన్నింటి కన్నా ముఖ్యమైనది. కాస్త ఓపిక పట్టండి, ఏం జరుగుతుందో చూస్తారు. మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. మొత్తం టోర్నమెంట్ పాకిస్థాన్‌లో జరుగుతుందని అనుకుంటున్నాం’ అని నఖ్వీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ట్రోఫీ జరగాల్సి ఉంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది. చివరిసారిగా 2017లో ఇంగ్లండ్‌లో ట్రోఫీ జరగగా.. పాకిస్థాన్ విజేతగా నిలిచింది.
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!