Champions Trophy 2025: పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంపైనే పీసీబీ ఆశలు!
- ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ
- 3 నగరాల్లో 15 మ్యాచ్‌లు
- ప్రభుత్వ నిర్ణయంపైనే పీసీబీ ఆశలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పీసీబీ షెడ్యూల్‌ను సిద్ధం చేసి ఐసీసీకి పంపగా.. బీసీసీఐ కారణంగా డేట్స్ ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం కొనసాగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం… పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంపైనే పీసీబీ ఆశలు పెట్టుకుందట.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్తాన్ వెళ్లేది లేదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. పీసీబీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బీసీసీఐ వెనక్కి తగ్గడం లేదు. ఐసీసీతో రాయబారం పంపినా బీసీసీఐ ఒప్పుకోలేదు. హైబ్రిడ్ మోడల్‌కు బీసీసీఐ సముఖంగా ఉంది. భారత్ ఆడే మ్యాచులను దుబాయ్ లేదా షార్జా వేదికగా నిర్వహించాలని సూచించింది. హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకొనేది లేదంటూ పీసీబీ అంటున్నా.. ఒకవేళ టోర్నీ రద్దయితే ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భారత్ లేకుండా.. టోర్నీ నిర్వహించినా బొక్క పడుతుంది. దీంతో ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వం చేతుల్లో పెట్టాలని పీసీబీ నిర్ణయించింది. ఈమేరకు ఐసీసీ పంపిన ఈ-మెయిల్‌ను ప్రభుత్వానికి పీసీబీ పంపినట్లు తెలుస్తోంది.
Also Read
Also Read: Ram Gopal Varma: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మపై కేసు!
‘ఐసీసీ నుంచి మాకు మెయిల్ వచ్చింది. భారత జట్టును బీసీసీఐ ఇక్కడకు పంపించడం లేదని అందులో ఉంది. ఐసీసీ టోర్నీ అయిన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు భారత్ రాదు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వానికి పీసీబీ పంపింది. సర్కారు ఇచ్చే సూచనలు, సలహాలపైనే తదుపరి నిర్ణయం ఆధారపడి ఉంటుంది’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి. మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరోవైపు ట్రోఫీ కోసం పీసీబీ ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది.
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!