పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. హరిహర వీరమల్లు ను ప్రమోషన్స్ హడావిడి ముగిసిన వెంటనే గ్యాప్ లేకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు పవర్ స్టార్. ఈ సినిమాను భారీ బడ్జెట్ పై…
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తుంది.. ఇక, మరో హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేఖ రాసింది సీపీఐ(ఎం).. కేంద్రం నుంచి వచ్చిన 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.1,121 కోట్లు వెంటనే పంచాయితీలకు విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచుల వేతనాలు పెంచాలని, గ్రామ సమస్యలు పరిష్కారం చేయాలని పవన్ కల్యాణ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమవేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఆగస్టు 15 నుండి స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అమలు చేయబోతున్నారు.. ఇక, ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ (లిప్ట్) పాలసీ 4.0... 2024-29కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.. 22 ఏపీ టూరిజం డెవలప్మెంట్ హోటళ్లు, ఆరు క్లస్టర్ల పరిధిలోని రిసార్టుల…
హరిహర వీరమల్లు సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణ ఆ సినిమాలో త్రివిక్రమ్ ప్రమేయం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిజానికి సినిమా ఆగిపోయిన తర్వాత మళ్లీ సినిమా మొదలు పెట్టాల్సిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారని, తనకు త్రివిక్రమ్‌తో టచ్‌లో ఉండాలని చెప్పారని అన్నారు. తాను అనుకున్న లైన్ తీసుకువెళ్లి త్రివిక్రమ్‌కి చెప్పగా అది ఆయనకు నచ్చిందని, వెంటనే పవన్ కళ్యాణ్‌కి జ్యోతి కృష్ణ రెడీగా ఉన్నాడు, సినిమా చేయవచ్చని చెప్పినట్లు వెల్లడించారు. పవన్…
Pawan Kalyan Tweet on Article 370 6th Anniversary: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ‘ఆర్టికల్ 370’ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. 2019 ఆగస్టు 5న ఈ అధికరణను నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా (జమ్మూ కశ్మీర్, లడఖ్) విభజించిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దుకు నేటితో ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా…
కవిత దీక్షకు కోర్టు నో.. ఇంటికి కవిత హైదరాబాద్ ధర్నాచౌక్‌లో కొనసాగుతున్న MLC కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్ష మంగళవారం డ్రామాటిక్ మలుపు తిరిగింది. కోర్టు అనుమతి నిరాకరించడంతో, పోలీసులు కవితను దీక్షా స్థలం నుంచి ఇంటికి తరలించే ఏర్పాట్లు ప్రారంభించారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే, పోలీసులు మరోసారి కవితను దీక్ష విరమించాలని కోరారు. అయితే కవిత అనుచరులు, జాగృతి కార్యకర్తలు దీక్ష కొనసాగించాలని పట్టుబట్టారు. పోలీసులు వారిని అడ్డుకుంటూ, వర్షం తగ్గిన…
కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆపరేషన్ కుంకీతో సరిహద్దు ప్రాంత రైతులకి భరోసా అని అన్నారు. పంటల్ని ధ్వంసం చేస్తున్న ఏనుగుల్ని.. కుంకీలు దారి మళ్లించాయి.. తొలి ఆపరేషన్ విజయవంతం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి…
కవిత ఎవరో నాకు తెలియదు.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎవరో తనకు తెలియదు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత బీసీ ధర్నా జోక్ అని ఎద్దేవా చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కోట్లాడుతాం అని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. అనాధ విద్యార్థినీ విద్యార్థులకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సహాయం అందించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ తనకు అందుతున్న జీతభత్యాల నుంచి పిఠాపురంలో అనాధ విద్యార్థిని విద్యార్థులకు ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఈ నెల కూడా చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం అందచేయడానికి ఏర్పాట్లు చేయవలసిందిగా కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 42 మందికి అయిదువేల రూపాయల చొప్పున చెక్కులను అందజేయనున్నారు. ఈ చెక్కులను జనసేన…