AP deputy CM Pawan Kalyan Tweet: యాక్సిడెంట్లో జనసేన కార్యకర్త మృతి చెందారు. ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండలం, చందాల గ్రామానికి చెందిన జనసైనికుడు చందూ వీర వెంకట వసంతరాయలు గాయపడి బ్రెయిన్ డెడ్ కు గురయ్యారన్న వార్త తీవ్ర బాధాకరమని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
OG Firestorm: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాబోయే యాక్షన్ చిత్రం OG లోని తొలి పాట ఫైర్స్టోర్మ్ సంచలనం సృష్టిస్తుంది. థమన్ స్వరపరచిన ఈ సాంగ్ శనివారం మధ్యాహ్నం విడుదల కాగా, తక్కువ సమయంలోనే లైక్స్, వ్యూస్ వర్షం కురిసింది. పాటకు అద్భుతమైన విజువల్స్ తో పాటు, అబ్బురపరిచే సంగీతం తోడవడంతో ఇది ఫ్యాన్స్ ను భారీగా ఆకట్టుకుంది. ఇకపోతే, పాట విడుదలైన 24 గంటలలోపు ఫైర్స్టోర్మ్ పాట 6.2 మిలియన్ వ్యూస్ ను…
కన్నడ బడా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహా’. అశ్విన్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎటువంటి అంచాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్ తో ఒక్కసారిగా ఊపందుకున్న ఈ సినిమా కలెక్షన్స్ లో రికార్డులు బద్దులు కొడుతూ వెళ్తోంది. రిలీజ్ అయిన కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 79 కోట్లు రాబట్టిందని తెలుపుతూ నిర్మాణసంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది.…
ఇవాళ 29 జాతీయ రహదారుల ప్రాజెక్ట్ లు రూ. 5 వేల కోట్లు విలువ చేసే పనులు శంఖుస్థాపన జరుగుతోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవాళ జరుగుతున్న కార్యక్రమం భారత ఐక్యతకు పునాదని తెలిపారు. భారత రత్న వాజపేయి దేశ రహదారుల ను మార్చి ముందడుగు వేశారు. ప్రపంచంలో అత్యంత ప్రభావ వంతమైన నాయకులు గా మోడీ గుర్తింపు తెచ్చుకున్నారు..
ఎన్టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ షోలో తాజాగా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన తన కెరీర్ గురించి, పవన్ కళ్యాణ్ తో తన స్నేహం గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.
ఇటీవల జరిగిన కింగ్డమ్ సినిమా సక్సెస్ మీట్లో విజయ్ దేవరకొండ గురించి నాగవంశీ కామెంట్లు చేశారు. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను కలుస్తున్నారా ? అని అడిగితే మా పవన్ కళ్యాణ్ విజయే అని అన్నారు. అయితే అది వివాదంగా మారడంతో తాజాగా నాగవంశీ స్పందించారు. ఈ విషయాలను కాంట్రవర్సీ చేసే సోకాల్డ్ జీనియస్ లకి చెబుతున్నాను. ఎప్పుడైనా ఒకరిని పొగడాలి అనుకోండి, హృతిక్ రోషన్ లాగా ఉన్నారు అంటారు కదా. Also…
టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ కోసం ఫాన్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ‘సాహో’ ఫేం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుండగా ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ అభిమానులలో అంచనాలు పెంచాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి పవర్ఫుల్ సాంగ్ ఓజీ ఫైర్ స్ట్రోమ్ ని విడుదల చేశారు మేకర్స్.…
జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.. పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వానికి పవన్‌కళ్యాణ్ ఝలక్‌లు ఇస్తున్నారా? కేబినెట్ మీటింగ్‌లోనే నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పేస్తున్నారా? అందుకే కొన్ని కీలకమైన నిర్ణయాల విషయంలో ప్రభుత్వ దూకుడుకు సడన్ బ్రేకులు పడుతున్నాయా? అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? కేబినెట్లో పవన్ ఎందుకు అడ్డుపడుతున్నారు?. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఇన్నాళ్ళు అలా… అలా… గడిచిపోయింది. కూటమి పార్టీల మధ్య సమన్వయం విషయంలో పెద్దగా ఇబ్బందులేమీ రాలేదు. కానీ…ఇప్పుడు మాత్రం ఆ పరంగా… ఎక్కడో,…