Deputy CM Pawan Kalyan: జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి మార్గం వేస్తాయి అని వ్యాఖ్యానించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సంస్కరణలను ముందుండి నడిపిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కృషి అభినందనీయం అంటూ ప్రశంసలు గుప్పించారు.. రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగినా.. సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించామని తెలిపారు. ఈ చరిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.. నిత్యావసర వస్తువుల ధరలు జీఎస్టీలో రెండు స్లాబ్ ల వల్ల తగ్గుతున్నాయని వెల్లడించారు.. జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి మార్గం వేస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జీఎస్టీ ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవాడనికి కింది వీడియోను క్లిక్ చేయండి..