Priyanka Arul Mohan: పవన్ డిప్యూటీ సీఎం అవ్వక ముందు అలా.. అయ్యాక ఇలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Arul Mohan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ‘ఓజీ’ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలో ట్రైలర్ విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ పాత్రికేయులతో ముచ్చటించి చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పవన్ కళ్యాణ్ గారితో ఓజీ ప్రయాణం గురించి చెప్పండి?
ఓజీతో దాదాపు రెండున్నరేళ్ల ప్రయాణం నాది. ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఓజీ సినిమాలో కణ్మని పాత్ర చేయడం మరింత అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రల్లో కణ్మని నాకు చాలా ఇష్టమైన పాత్ర. ఈ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. పవన్ కళ్యాణ్ గారితో పని చేయడం అనేది ప్రతిరోజూ అదృష్టమే. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు జెంటిల్ మేన్. అందరినీ సమానంగా చూస్తారు. ఆన్ స్క్రీన్ లో మరియు ఆఫ్ స్క్రీన్ లో ఆయన రియల్ హీరో.
Also Read
- AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
- IND vs NZ: గుర్నూర్ బ్రార్, సీఫెర్ట్ మధ్య గొడవ.. శాంతిదూతలా మారిన కోహ్లీ.. అసలు ఏం జరిగింది? (వీడియో)
- AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల
- CP Mahesh Bhagwat: "అదే నా మొదటి ప్రాధాన్యత".. నూతన సీపీ మహేష్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ ప్రాజెక్ట్ లోకి మీరు ఎలా వచ్చారు?
మూవీ అనౌన్స్ మెంట్ అయిన తర్వాత డైరెక్టర్ గారు నాకు ఈ కథ వినిపించారు. కథ నాకు చాలా నచ్చింది. వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. నేను పోషించిన కణ్మని పాత్ర చాలా నచ్చింది. పైగా, పవన్ కళ్యాణ్ గారి సినిమా. సుజీత్ గారు డైరెక్టర్, డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణం. ఇంతకంటే ఏం కావాలి ఈ సినిమా ఒప్పుకోవడానికి.
శబాష్ Smriti Mandhana.. ICC వన్డే ర్యాంకింగ్‌లో వరల్డ్ నంబర్.1 గా!
కణ్మని పాత్ర ఎలా ఉండబోతుంది?
ఇది 1980-90లలో జరిగే కథ. పాత్రను మలిచిన తీరు కానీ, ఆహార్యం కానీ అప్పటికి తగ్గట్టుగానే ఉంటుంది. కణ్మని ఒక ఇన్నోసెంట్ స్వీట్ గర్ల్. గంభీర పాత్రతో గాఢమైన ప్రేమలో ఉంటుంది. గంభీర జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర కణ్మని.
సువ్వి సువ్వి పాటకు ఈ స్థాయి స్పందన వస్తుందని ముందే ఊహించారా?
తమన్ గారితో మొదటిసారి పని చేశాను. ప్రతి పాటకి వైవిధ్యమైన సంగీతం అందించారు. ఇందులో ఆయన స్వరపరిచిన మొదటి పాట ‘సువ్వి సువ్వి’నే. ఈ పాటను అందరికీ వినిపించాలని ఎంతగానో ఎదురుచూశాను. విడుదల తర్వాత అందరికీ సాంగ్ నచ్చడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి మీకు ముందే తెలుసా..?
పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనేది అవధులు లేనిది. నేను బెంగళూరులో ఉన్నప్పుడే ఆయన క్రేజ్ గురించి తెలుసు. అయితే ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు తెలిసిందే ఏంటంటే.. నేను ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంది. ఎంత క్రేజ్ ఉన్నా కూడా.. పవన్ గారు ఒదిగే ఉంటారు. డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా సింపుల్ గా ఉంటారు.
CM Chandrababu: వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎర్ర చందనంపై ఆసక్తికర వ్యాఖ్యలు
సెట్ లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడేవారు?
ఎక్కువగా పుస్తకాల గురించి మాట్లాడతారు. ఆయన చదివిన కథలు, నవలల గురించి చెప్తారు. చరిత్ర గురించి మాట్లాడతారు. అప్పుడప్పుడు సినిమాలు, రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ప్రజల గురించి ఎక్కువ మాట్లాడతారు.
షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సూచనలు ఇస్తుంటారా?
సన్నివేశం షూట్ చేయడానికి ముందు దర్శకుడు, నటీనటులతో పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు. సినిమాకి ఉపయోగపడే పలు గొప్ప సూచనలు ఇస్తుంటారు. నటుడిగా కూడా ఆయన తన పాత్రను చాలా సులభంగా చేస్తుంటారు. పవన్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు.
మీరు సినిమా చూశారా?
ఇంకా చూడలేదు. కొన్ని సన్నివేశాలు చూశాను. విజువల్ గా చాలా బాగున్నాయి.
ఇది యాక్షన్ సినిమా కదా.. ఫ్యామిలీ డ్రామా ఉంటుందా?
ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో యాక్షన్ అనేది ఒక భాగం మాత్రమే. బలమైన కథ ఉంది. ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది.
డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ గారు సెట్ లో ఎలా ఉన్నారు?
ఇప్పుడు ఆయన చాలా ప్రశాంతంగా, మరింత బాధ్యతగా కనిపిస్తున్నారు. ఎక్కువగా ప్రజల గురించి ఆలోచిస్తారు. ప్రస్తుతం యువత ఎలా ఉన్నారు? రాజకీయాలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలు చర్చిస్తుంటారు. డిప్యూటీ సీఎం అంటే చిన్న విషయం కాదు కదా. ఆయన తన బాధ్యతను గొప్పగా నిర్వహిస్తున్నారు.
దర్శకుడు సుజీత్ గారి గురించి?
సీన్ ఎలా తీయాలి, నటీనటుల నుంచి ఎలాంటి నటన రాబట్టుకోవాలి.. ఇలా ప్రతి విషయంపై ఆయనకు స్పష్టత ఉంది. నా క్యారెక్టర్, లుక్ బాగున్నాయంటే దానికి కారణం సుజీత్ గారే.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ గురించి?
నాకు హోమ్ ప్రొడక్షన్ లాగా అయిపోయింది. డీవీవీ బ్యానర్ లో వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు. నిజానికి నేను మొదట ఓజీ సినిమానే అంగీకరించాను. కానీ, సరిపోదా శనివారం చిత్రం ముందు విడుదలైంది. నిర్మాతలు దానయ్య గారు, కళ్యాణ్ గారు చాలా మంచి మనుషులు. వాళ్లంటే నాకు అపారమైన గౌరవం.
తదుపరి ప్రాజెక్ట్ లు?
తెలుగులో కొన్ని కథలు వింటున్నాను. అలాగే, వేరే భాషల్లో పలు సినిమాలు చేస్తున్నాను.
తాజావార్తలు
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
Rohit Sharma Golden Duck: తొలి బంతికే గోల్డెన్ డక్.. ఆ ఇద్దరు అన్నిసార్లా.. భారత బ్యాటర్ల లిస్ట్ ఇదే!
-
Rahul Gandhi vs PM Modi: ప్రధాని మోడీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు!
-
AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
-
Big Action Against Zakir Naik: జాకిర్ నాయక్‌కు భారీ షాక్.. IRFపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగించిన కేంద్రం!
ట్రెండింగ్
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..