పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
Also Read : Lokah : మోహన్ లాల్ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసిన ‘లోక’
ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్నారు. కాగా పవర్ స్టార్ ఇప్పుడు ఈ రెండు సినిమాలను ఫినిష్ చేసాడు. OG డబ్బింగ్ తో సహా ఫినిష్ చేసేయగా ఉస్తాద్ షూట్ ఫినిష్ చేసాడు. ఈ నేపధ్యంలోపవర్ స్టార్ నెక్ట్స్ సినిమా ఏంటనే చర్చ మొదలైంది. ఇప్పటివరకు అయితే ఎటువంటి కథలను పవన్ ఓకే చేయలేదు. కొంత గ్యాప్ తీసుకుంటారని సమాచారం. అలాగే పొలిటికల్ గా కొంత బిజిగా ఉండబోతున్నారు. ఈ గ్యాప్ లో కథలు విని నచ్చితే సినిమాలు చేస్తారు లేదంటే లాంగ్ బ్రేక్ తీసుకుంటారని తెలుస్తోంది. మరి పవర్ స్టార్ సినిమాలు చేస్తారో చేయరో చూడాలి.