పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే, మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్నారు. ఆయన ఉపముఖ్యమంత్రి అయ్యాక ఒక సినిమా కూడా ఒప్పుకోలేదు, కానీ ఉపముఖ్యమంత్రి అవ్వకముందు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే ఈమధ్య షూటింగ్ పూర్తి చేసిన ఓజీ సినిమా ఈ నెలలో రిలీజ్‌కి రెడీ అయింది. సెప్టెంబర్ 25వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈ సినిమాకి ప్రీమియర్స్ ఉండకపోవచ్చు అని ప్రచారం జరిగింది, కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఓజీ సినిమాకి ప్రీమియర్స్ ఉన్నాయని తెలుస్తోంది.
Also Read:Little Hearts Jai Krishna : టాలీవుడ్ కు కొత్త కమెడియన్ వచ్చాడోచ్..
ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు త్వరలోనే జీవో కూడా జారీ చేసే అవకాశం ఉంది. వాస్తవానికి 25వ తేదీ తెల్లవారుజాము ఒంటిగంట నుంచి షోలు ప్లాన్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆ షోలకు పర్మిషన్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. వాటికి బదులు ముందు రోజు రాత్రి తొమ్మిది గంటలకు పర్మిషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 1000 రూపాయలు టికెట్ రేటుగా జీఎస్టీ తో కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలో ఫిక్స్ చేయబోతున్నట్లుగా సమాచారం. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుజిత్ డైరెక్ట్ చేశాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని డివివి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.