Pawan Kalyan: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. భారత దేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందినా.. ఆ ఫలాలు పొందటానికి తెలంగాణ ప్రజలకు మరో 13 నెలలు సమయంపట్టిందని గుర్తుచేశారు.. నిజాం నిరంకుశ పాలనపై భారత ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో సాగిన పోలీస్ యాక్షన్ మూలంగా తెలంగాణకు స్వేచ్ఛ దక్కి విమోచన కలిగిందని చెప్పుకొచ్చారు.. ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు పవన్ కల్యాణ్…
ఇక, నిజాం ఏలుబడిలో రజాకార్లు ఊళ్ల మీదపడి సాగించిన అకృత్యాల వల్ల ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది.. దానికి వ్యతిరేకంగా.. రజాకార్లపై రైతాంగం చేసిన సాయుధ పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు పవన్ కల్యాణ్.. రజాకార్లు చెలరేగిన తీరు, వారికి నాయకత్వం వహించిన కాసీమ్ రజ్వీ.. ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురవేస్తానని విర్రవీగిన విధానం… వల్లభాయ్ పటేల్ ఏ విధంగా కట్టడి చేసింది.. ఈ తరానికి తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు.. నిజాం పాలనపై రైతులు, సామాన్య ప్రజలు చేసిన పోరాటం తాలూకు స్ఫూర్తి నేటి తరంలోనూ ఉందన్నారు.. తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..