Krish : హరిహర వీరమల్లు సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టారు. అయితే సినిమా ఆలస్యం అవుతూ ఉన్న కారణంగా ఆయన తప్పుకోవడంతో ఆయన స్థానంలో సినిమా నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. అయితే క్రిష్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో ఘాటి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా క్రిష్ అండ్ టీం మీడియా…
Perni Nani: వైస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం అన్నీ చేశామని చెప్పుకునే వారు.. నిజం అయితే వేలాది మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల మధ్య విజయోత్సవాలు జరుపుకోవాల్సిందని ప్రశ్నించారు. అప్పట్లో అర్జీలు తీసుకోవటానికి విశాఖకు వెళ్లామని చెబుతున్నారు, అయితే ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదని ఎద్దేవా చేశారు. కనీసం విజయవాడలో కూడా అర్జీలు తీసుకోవడం లేదని…
మెగా, అల్లు కాంపౌండ్స్ మధ్య దూరం పెరుగుతోంది అనే ప్రచారం ఇప్పటిది కాదు. కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ ఈవెంట్లో “జై పవర్ స్టార్” అని అనాల్సిందిగా కోరడంతో అల్లు అర్జున్ ఇరిటేట్ అయి, “నేను చెప్పను బ్రదర్” అని అనడంతో కొంత ఈ వివాదానికి కారణమైందని చెప్పొచ్చు. ఆ తర్వాత అల్లు అర్జున్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన కొన్ని పనులు మెగా ఫాన్స్‌కి కోపం తెప్పించాయి. దీంతో మెగా అభిమానులు, అల్లు అభిమానులు అంటూ…
తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలలో జనసేన పార్టీని విస్తరించండని అంటున్నారని.. తాను విస్తరించాలి అంటే ముందు మీరు పోరాటం చేయండి అని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మీకు అండగా సైద్ధాంతిక బలం తాను ఇస్తాను అని, మీరు బలోపేతం చేస్తే ఖచ్చితంగా ఒకరోజున జనసేన జాతీయ పార్టీగా ఎదుగుతుందన్నారు. తాను ఒకరోజు జనసేన జాతీయ పార్టీ అవుతుంది అంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు.. కానీ ఖచ్చితంగా ప్రజలు అందరూ కలిసి…
జనసేన 2014లో పోరాటాల గడ్డ తెలంగాణలో ప్రారంభించాం అని, ఆంధ్రప్రదేశ్‌లో నిలదొక్కుకున్నాం అని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. సగటు మనిషి కోపం నుంచి పుట్టిందే జనసేన పార్టీ అని చెప్పారు. కులం, కుటుంబం, రాష్ట్రం, ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదన్నారు. ప్రజల కష్టాలు పరిష్కరించినప్పుడు తన నిర్ణయం సరైందే అనిపించిందన్నారు. పార్టీ మొదలుపెట్టినప్పుడు తన ఆలోచన సగటు మనిషి ఆలోచన అని.. జనాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆకాంక్షలు…
Chiranjeevi – Allu Arjun : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇప్పటికే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలు కోకాపేటలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి, అల్లు అర్జున్ కనకరత్నమ్మ పాడె మోశారు. ఇందుకు…
సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కౌంటర్‌కు దిగారు.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక చాలా సంతోషించాం.. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయినా ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి లేదు.. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం 5 ఎకరాలు భూమి, 5 స్థలం, ఉద్యోగం ఇచ్చారు.. అది కూడా జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు.. నా కూతురుకు ఇదే న్యాయం చేసినట్టా? అని ప్రశ్నించారు. అయినా, నేను డబ్బుకోసం పోరాటం…
విశాఖ వేదికగా 'సేనతో సేనాని' కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. రెండురోజుల పాటు సాగిన ఈ సమావేశాలు.. ఇవాళ బహరంగసభతో ముగియనున్నాయి.. సేనతో సేనాని సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి క్రియాశీలక కార్యకర్తలు హాజరుకానున్నారు.. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సభ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6 గంటలకు పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు..
రుషికొండ టూరిజం రిసార్ట్‌లకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, డోల బాలవీరంజనేయస్వామి సభ్యులుగా కమిటీ ఏర్పాటు అయింది. టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సమన్వయంతో ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. అవసరాన్ని బట్టి టూరిజం శాఖకు సంబంధించి కొంతమంది అధికారులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Also Read: Pawan Kalyan: 21 ఏళ్ల వయసులోనే రాజకీయ ఆలోచనలు వచ్చాయి..…