పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది.
Also Read:Bigg Boss 9 : రీతూ చౌదరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. తనూజ అతనితో.. అరేయ్ ఏంట్రా ఇది..
ఈ జీవో ప్రకారం, ‘ఓజీ’ సినిమా విడుదలైన రోజు నుంచి అక్టోబర్ 4 వరకు (10 రోజుల పాటు) టికెట్ ధరలు పెంచుకోవచ్చు. సింగిల్ స్క్రీన్‌లలో టికెట్‌కు రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150 అదనంగా పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే, ఈ నెల 25న తెల్లవారుజామున ఒంటిగంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధర రూ.1000గా నిర్ణయించారు.
Also Read:Tunnel: సెప్టెంబర్ 19న అథర్వ మురళి ‘టన్నెల్’ రిలీజ్
ఈ నిర్ణయంపై నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైనర్స్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌లకు థాంక్స్ చెప్పింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ‘ఓజాస్ గంభీర’గా కనిపించనున్నారు. ప్రియాంక మోహన్ కథానాయికగా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. జపాన్ వాయిద్య పరికరం కోటోను ఉపయోగించి కొన్ని సన్నివేశాలకు ప్రత్యేకమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ క్రియేట్ చేశారు.