ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా పీవీ సింధు వివాహం జరగనుంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులను తన వివాహానికి హాజరు కావాలని సింధు ఆహ్వానిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తన వివాహానికి హాజరు కావాలని పీవీ సింధు ఆహ్వానించారు.
భద్రాద్రి జిల్లా సరిహద్దులోకి పెద్దపులి.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు ములుగు జిల్లా తాడ్వాయి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పెద్దపులి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించింది. పినపాక ఇల్లందు కొత్తగూడెం అటవీ పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్లుగా గుర్తించారు అటవీశాఖ అధికారులు. ఈ పులి అటు ములుగు జిల్లాలోకి, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి తిరుగుతున్న పరిస్థితి ఉందని తెలిపారు. గత మూడేళ్ల క్రితం కూడా కరకగూడెం ఆళ్లపల్లి రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పర్యటించిందని అన్నారు. అప్పటిలో ఒక…
మన కోసం ఎవరు నిలబడ్డారో వారిని మరువ కూడదని.. కొందరు తల్లిదండ్రులను కూడా మర్చిపోతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలుగు వారికి ఓ గుర్తింపు ఇచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని.. సమాజం కోసం బ్రతికిన మహానుభావులు పొట్టి శ్రీరాములు అని పవన్ వ్యాఖ్యానించారు.
సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి.. బెయిల్ వచ్చినా.. అది సరైన సమయానికి జైలుకు చేరకపోవడంతో.. ఒకరోజు జైలులో ఉండి.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదయ్యాడు.. మొదట గీతాఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ కాసేపు గడిపిన తర్వాత తన నివాసానికి చేరుకున్నారు.. కుటుంబ సభ్యులు బన్నీని చూసి భావోద్వేగానికి గురయ్యారు.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఘటన అన్నారు.. బాధిత రేవతి కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పారు.. అనుకోకుండా జరిగిన ఈ ఘటన…
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు శనివారం పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అక్కవరం గ్రామం సమీపంలో దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కి తీసుకువెళ్లారు పోలీసులు. న్యాయమూర్తి ముందు హాజరు పరిచిన తర్వాత మెయిల్ లభిస్తుందా లేక రిమైండ్ కి తరలించాలని విషయం మీద క్లారిటీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అల్లు అర్జున్ కి వరసకు మామ అయ్యే పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. నిజానికి…
2024-29 ఏపీ మారిటైమ్ పాలసీని విడుదల చేసింది ప్రభుత్వం.. మారిటైమ్ పాలసీ అమలుకు ఏపీ మారిటైమ్ బోర్డును నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఐ అండ్ ఐ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్.. రాష్ట్రంలో పోర్టు ఆధారిత అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, లాజిస్టిక్స్, ఇతర మారిటైమ్ సేవలు అందించేలా నూతన విధానం రూపొందించింది ప్రభుత్వం.. ఏపీ మారిటైమ్ విజన్ ను ఆవిష్కరించటంతో పాటు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేలా కొత్త…
గడచిన ఆరు నెలలుగా ప్రజల నుంచి 1,29,963 ఫిర్యాదులు ప్రభుత్వానికి వచ్చినట్టు తెలిపారు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్ కుమార్.. భోజన విరామం తర్వాత రాష్ట్రంలో ఫిర్యాదుల స్వీకరణపై కలెక్టర్ల సదస్సులో సమీక్ష నిర్వహించారు.. గ్రీవెన్స్ పరిష్కారంపై ప్రజెంటేషన్ ఇచ్చారు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్ కుమార్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఫిర్యాదులు అన్నింటినీ ఒక్కచోట నమోదు చేస్తున్నాం అన్నారు..