రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కానీ.. పరిపాలన గాడి తప్పకూడదని కలెక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజలు తమని విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారని, వారు తమ ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారన్నారని అధికారులకు చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలను తాము చేయగలమని, వాటిని ప్రజలకు తీసుకెళ్లేది ఐఏఎస్, ఐపీఎస్లే పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులతో మిగిలింది పది లక్షల కోట్ల అప్పు అని డిప్యూటీ సీఎం విమర్శించారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల…
Google Search : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది ఒక్క సినిమాలో నటించకపోయినా ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12 నాటికి ఆరు నెలలు పూర్తి అవనుంది.. దీంతో, రాష్ట్రంలో పాలనను మరింత పరుగులు పెట్టించడానికి సీఎం చంద్రబాబు సిద్దమయ్యారు.. ఇందు కోసం ఈనెల 11, 12 తారీఖుల్లో కలెక్టర్ల సదస్సు జరుపనున్నారు.. సచివాలయంలోని 5 వ బ్లాక్ లోని కలెక్టర్ కాన్ఫురెన్స్ హాల్లో సదస్సు నిర్వహించనున్నారు.
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై త్వరలో నిర్ణయం వెలువడనుంది. ప్రస్తుతం నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
పవర్ స్టార్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తానంటూ బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ పర్సనల్ పిఆర్ఓ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకీ బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలుస్తోంది. ఆయనను చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అభ్యంతరకరమైన భాషతో హెచ్చరిస్తూ సదరు అగంతకుడు మెసేజ్…
మరోసారి.. అంటే ఈ నెల 10, 11 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. కానీ, తాజాగా తేదీలను మార్చేసింది.. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
పుష్ప సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా మొత్తాన్ని హిట్ చేసేది దర్శకుడు మాత్రమేనని అన్నారు ఈరోజు నాకు పేరు వచ్చినా వేరే ఆర్టిస్టులకు పేరు వచ్చిన ఆ క్రెడిట్ అంతా ఒక్కడికే దక్కుతుంది. నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినా సరే అవన్నీ ఆయన చేసిన డిజైన్ కారణంగానే. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నామీద సుకుమార్ కి ఉన్న ప్రేమే కారణం. ఇంతకంటే నేనేం చెప్పగలను డార్లింగ్ అని సుకుమార్…
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ప్రభుత్వం ఎన్ని సిట్లు ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే టీటీడీ లడ్డుపై సిట్, గంజాయిపై ఈగల్, ఇప్పుడు రైస్పై సిట్.. ఇవన్నీ ప్రచారం కోసం తప్ప ఏం లేదన్నారు.
జగిత్యాలలో మైనర్ బాలిక మిస్సింగ్ .. 24 గంటలు అయినా దొరకని ఆచూకీ జగిత్యాలలో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక మిస్సింగ్ కలకలం రేపింది. 24 గంటలు అయినా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని విజ్డమ్ హైస్కూల్ హాస్టల్లోనే ఇబ్రహీం పట్నంకు చెందిన బాలిక పదవ తరగతి చదువుకుంటుంది. నిన్న మధ్యాహ్నం భోజన…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అనుసరిస్తున్న విధానం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అత్యుత్తమ పనితీరును కనబరిచిన పంచాయతీలకు కేంద్ర సర్కారు ఇచ్చే జాతీయ స్థాయి పురస్కారాలుకు నాలుగు గ్రామాలు ఎంపిక కావడం విశేషం.