MLC Botsa Satyanarayana: సారీ చెప్పి తప్పించుకోలేరు.. తొక్కిసలాట ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి..
- తిరుపతి తొక్కిసలాట ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి..
- సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలి..
- శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యన్నారాయణ విజ్ఞప్తి..
- సారీ చెప్పడం ద్వారా జరిగిన నష్టం నుంచి తప్పించుకోలేరు..
- ప్రయశ్చిత దీక్ష సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల్లో ఎవరు చేస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Botsa Satyanarayana: తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సుమోటోగా తీసుకుని సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యన్నారాయణ విజ్ఞప్తి చేశారు. సారీ చెప్పడం ద్వారా జరిగిన నష్టం నుంచి తప్పించుకోలేరని.. ప్రయశ్చిత దీక్ష సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల్లో ఎవరు చేస్తారు అని ప్రశ్నించారు. తొక్కిసలాట దైవ నిర్ణయం అనే వ్యాఖ్యలు… కుట్ర కోణం ఉంది అనే మంత్రుల మాటలు చూస్తే పాలకవర్గం, ప్రభుత్వం వైఫల్యం కనిపిస్తోందన్నారు బొత్స. రాజకీయాలు చేయడం ద్వారా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల జరిగిన ఘటన నుంచి తప్పించుకోలేరు అన్నారు బొత్స..
Read Also: Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై ఉపాసన ట్వీట్
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం వల్ల తిరుపతిలో ఆరు ప్రాణాలు పోయాయి… ప్రభుత్వాలు ఎన్ని మారినా.. దురదృష్టకర ఘటనలు గతంలో ఎన్నడు చోటు చేసుకోలేదు.. ఇది చాలా బాధాకరం అన్నారు బొత్స.. తొక్కిసలాట వెనుక కుట్ర కోణం, డబ్బులు ఇచ్చారు అని చెప్పడం తప్పించుకోవడమే అవుతుందన్న ఆయన.. తిరుపతి ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి.. హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి కలిగించుకొని విచారణ చేయించాలని సూచించారు.. కూటమి ప్రభుత్వం నియమించిన అధికారులు విధుల్లో ఉన్నప్పుడు కొంత మందికి పార్టీలు, కులం ముద్రలు వేసి మానసికంగా ఇబ్బంది పెట్టడం కదా..? అని ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తే ట్రాఫిక్ లో కావాలనే ఆపేయడం ఎంత వరకు సమంజసం.. ఇటువంటి చర్యల వల్లే సమస్యలు వస్తాయని హెచ్చరించారు.. ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి సరిపెట్టేశారు.. ఇంగ్లీషోడు థాంక్స్ అని చెప్పినట్టు.. ఒక్క సారీ చెప్పేస్తే సరిపోతుందా? అని మండిపడ్డారు.
Read Also: CM Revanth Reddy: కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఆగ్రహం..
తిరుపతి తొక్కిసలాట తర్వాత వైకుంఠ దర్శనం కోసం గుడికి వెళ్లడానికి భక్తులు భయపడ్డారు.. అందుకే గుళ్లు ఖాళీగా వున్నాయన్నారు బొత్స.. పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం మొదలు పెట్టి ఇన్నేళ్లు అయితే.. ఇవాళే ఎందుకు తొక్కిసలాట జరిగింది అని నిలదీశారు.. జగన్మోహన్ రెడ్డి బాధితులకు అండగా నిలిస్తే వక్రీకరించే విధంగా చేసిన వ్యాఖ్యలు ఎంత వరకు సమంజసం అని మండిడపడ్ఆరు.. ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి విజయవాడ వరదలు నుంచి తిరుపతి తొక్కిసలాట వరకు అదే కారణం అన్నారు బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!