AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది… ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది.. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కూడా ఏపీ కేబినెట్ లో చర్చిస్తారు… తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం విదితమే కాగా.. ఎజెండా తర్వాత ఈ అంశంపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు..
సచివాలయంలో ఉదయం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్ సమావేశంలో.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది.. ఇక, పలు కంపెనీలకు భూములు కేటాయింపుకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది.. మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10 శాతం కేటాయింపు అంశంపై చర్చించి ఓ నిర్ణయానికి రాబోతున్నారు.. గీతకార్మికులకు ఇచ్చే షాపులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. మరోవైపు.. కేబినెట్ భేటీ అనంతరం.. మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది.