పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేశారు. జనసేన తరఫున 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలోకి దిగితే 21 మంది గెలిచారు. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. ఈరోజు సంక్రాతి సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.
Buddha Venkanna: రేపు మాచర్ల వస్తా దమ్ముంటే అడ్డుకోండి.. బుద్ధా వెంకన్న సవాల్
ఆ ప్రోమోలో పవన్ కళ్యాణ్ వీరమల్లు చెబితే వినాలి అనేలా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. హరిహర వీరమల్లు చిత్రం నుండి ఈనెల 17వ తారీఖున మొదటి పాట రిలీజ్ కానుంది. ఆ పాటని పవన్ కళ్యాణ్ పాడారని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి తొలుత క్రిష్ డైరెక్టర్గా వ్యవహరించారు. సినిమా వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో ఆయన దర్శకత్వ బాధ్యతలు నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఇక సినిమాని ఈ ఏడాది మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.