ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ఇష్టారీతిన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. అప్పట్లో వాటన్నిటిని భరించిన టీడీపీ శ్రేణులు.... కూటమి అధికారంలోకి వచ్చాక ఓపెనైపోతున్నాయి. వర్మ మా నేతల మీది పిచ్చిపిచ్చి పోస్టుల పెట్టి మనోభావాలు దెబ్బతీశారంటూ రాష్టం నలు మూలల కేసులు పెడుతున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో.. తన ఓటమిపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 2019లో నన్ను గెలిపించలేదు.. పరీక్షించారు.. నిలబడతాడో లేదో అని.. అది మంచిదేనని పేర్కొన్నారు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. Also Read : Shankar…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగింది. అమరావతి నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. హడ్కో ద్వారా రూ.11వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్ అప్రూవల్ వచ్చింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్రపడింది.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ నిర్ణయాలను వివరించారు..
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం..
నీరు దొరకనప్పుడే నీటి విలువ తెలుస్తుందని డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భీష్మ ఏకాదశి రోజున నీరు తాగకుండా ఉంటే ఎలా ఉంటుందో.. నీరు దొరక్కపోతే అలా ఉంటుందన్నారు. జలజీవన్ మిషన్ ప్రధాని నరేంద్ర మోడీ కల అని, ప్రతీ ఇంటికి ప్రతీరోజు 20 లీటర్ల నీరు ఇవ్వాలన్నదే లక్ష్యం అని తెలిపారు. జనవరి నెలాఖరుకు పూర్తి డీపీఆర్‌తో కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తున్నాం అని డిప్యుటీ సీఎం చెప్పారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ పథకం…
నిద్రలో పళ్ల సెట్ మింగేసిన వ్యక్తి.. ఆ తరువాత..! విశాఖపట్నంలోని ఒక వ్యక్తి పళ్ల సెట్ మింగడంతో ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయింది. 52 సంవత్సరాల వయస్సున్న ఈ వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం తనకు కృత్రిమ పళ్ల సెట్ అమర్చుకున్నాడు. సెట్ అటు ఇటు ఊడిపోతుండడంతో, నిద్రలో ఉన్నప్పుడు అది ఊడిపోయి, తెలియకుండానే ఆయన దాన్ని మింగేసి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. పళ్ల సెట్ కుడి ఊపిరితిత్తి మధ్య భాగంలో ఇరుక్కుంది. అయితే ఎడమ ఊపిరితిత్తి సహజంగా పనిచేస్తుండటంతో శ్వాసకోణంలో…
హీరో అల్లు అర్జున్ మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లారు. నాగబాబు ఇంటికి తన భార్య స్నేహారెడ్డితో కలిసి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అరెస్ట్ పరిణామాలపై వీరిద్దరూ చర్చించారు. అంతకు ముందు అల్లు అర్జున్ సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు.
ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా పీవీ సింధు వివాహం జరగనుంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులను తన వివాహానికి హాజరు కావాలని సింధు ఆహ్వానిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తన వివాహానికి హాజరు కావాలని పీవీ సింధు ఆహ్వానించారు.