ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న బియ్యం అక్రమ రవాణా కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. కాకినాడ తీరంలో రేషన్ బియ్యంతో స్టెల్లా నౌక పట్టుబడటం, అక్రమ రవాణా వెనుక యంత్రాంగం అలసత్వం, మాఫీయాను మించిన నెట్వర్క్ ఏర్పడిపేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్న తీరుపై సీరియస్ అయ్యింది. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత సమగ్ర విచారణ కోసం CBCID కి అప్పగించాలని నిర్ణయించింది. రే
పవర్ స్టార్ ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడలో ఒక షిప్పు పరిశీలనకు వెళ్లి అందులో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని తెలిసి వెంటనే దాన్ని ‘సీజ్ చేయాల్సిందిగా ఆదేశించారు. సినీ పక్కీలో ఉన్న ఆ సీన్ చూసి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. నిజమైన నాయకుడు డ్యూటీ చేస్తే ఇలానే ఉంటుంది ఏమో అన్నట్టు పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో ఆ వీడియోని వైరల్ చేశారు. Pushpa 2: పుష్ప 2…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ థాంక్స్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక సుదీర్ఘమైన మెసేజ్ షేర్ చేశారు. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలను నిర్మాతల కోరారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ…
కాకినాడ పోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ వెళ్లిన బోటులో కస్టమ్స్, పోర్టు అధికారి ఇద్దరు ఉన్నారని.. అనుమతి ఇవ్వాల్సిన అధికారులు అక్కడే ఉండగా పర్మిషన్ ఇవ్వటం లేదని చెప్పటం ఏంటన్నారు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం షిప్లో తనిఖీలు ఓ మంచి ప్రయత్నం అని, ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలన్నారు. పవన్‌ను షిప్ ఎక్కడవద్దని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పి ఉండాలని, లేకపోతే…
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యిందని.. ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, అభివృద్ధి అంతకంటే లేదని కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, పాలన అనేదే లేకుండా పోయిందన్నారు. వైఎస్ జగన్ గారి హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో తమ ప్రభుత్వం పరిహారం అందించిందని, ఇప్పుడు పంట నష్టపోయినా దిక్కు లేదని ఆగ్రహం…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరగనుంది. కాకినాడ పోర్టు వ్యవహారం సహా ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించి.. భారీ ఎత్తున జరుగుతున్న రేషన్ బియ్యం…
Daggubati Purandeswari : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు అంకితభావంతో పని చేస్తున్నారని తెలిపారు. 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తక్కువ సమయంలోనే 11 కోట్ల మంది సభ్యత్వం పొందారని, ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చగలిగినందుకు పార్టీ కార్యకర్తల కృషిని కొనియాడారు. కార్యకర్తల ప్రతిష్ఠాభిమానంతోనే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో పారదర్శకంగా, సమర్థవంతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని వివరించారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి…
గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను దారుణంగా వేధించారని మండిపడ్డారు జేసీ.. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు.. ఎమ్మెల్యేలు, నాయకులు బయటకు రావాలని పిలుపునిచ్చారు.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే ఇంటికొచ్చి చెప్పుతో కొడతా అంటూ హెచ్చరించారు.. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తాడిపత్రి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యేలను వెనకేసుకొస్తున్నాడు.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంగతి త్వరలోనే తేలుస్తా అన్నారు.
Pawan Kalyan : రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో కలకలం రేగింది. ఇవాళ ఆయన కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యం, అలాగే మరో బార్జ్ ఐవీ 0073 లో 1064 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించింది. పవన్ కళ్యాణ్‌తో పాటు 400 – 500…