పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పట్టుబడింది. పోలీసుల కస్టడీ అనంతరం ఆమెను హర్యానాలోని హిసార్ జైలుకు తరలించారు. బుధవారం జైల్లో మల్హోత్రాను తండ్రి హరీష్ కలిశారు. జరిగిన పరిణామాలను తండ్రి అడిగి తెలుసుకున్నారు.
భారత నావికాదళం త్వరలో కొత్త వ్యూహాత్మక ఆయుధం, స్వదేశీ మైన్ కౌంటర్ మెజర్ వెసల్స్ (MCMVs) ను పొందే అవకాశం ఉంది. నీటి అడుగున దాగి ఉన్న శత్రువుల ల్యాండ్మైన్లను గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం కలిగిన 12 నౌకలను రూ.44,000 కోట్ల వ్యయంతో తయారు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లలో జరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం మాక్ డ్రిల్లను ఆదేశించింది. దీంతో భారత సైన్యం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా?
Pakistan: పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. మంగళవారం సాయంత్రం ఫైజలాబాద్ డివిజన్లో 4.2 తీవ్రతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ తెలిపింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోని ఫైసలాబాద్ డివిజన్లోని ఝాంగ్ తహసీల్ సమీపంలో భూకంప కేంద్రం ఉంది.
Pakistan: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ బౌలర్ సదియా ఇక్బాల్ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. సదియా, ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. గత వారం ర్యాంకింగ్స్‌లో సెకండ్ ప్లేస్ లో ఉన్న ఆమె ఓ స్థానం మెరుగుపర్చుకుంది.
Turkey: టర్కీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతీయులు ఆ దేశంపై మండిపడుతున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి సహకరించింది. టర్కిష్ డ్రోన్లతో పాటు వాటిని ఆపరేట్ చేయడాని ఆ దేశ సిబ్బందిని కూడా నియమించింది. భారత్ జరిపిన దాడుల్లో డ్రోన్లతో పాటు, వాటిని ఆపరేట్ చేయడానికి వచ్చిన సిబ్బంది కూడా హతమయ్యారు. తాజాగా, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ టర్కీ పర్యటనకు వెళ్లారు.
అదే నా ఆశ.. ఆకాంక్ష! నూతన మార్గదర్శకాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలన్నదే తన ఆశ, ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే నిలిచిందన్నారు. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. మహానాడు సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా…
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. మే 7న జరిగిన ఈ దాడులకు సంబంధించి కొత్త ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ దాడులను ‘‘ఆపరేషన్స్ రూమ్’’ నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల అధిపతులు పర్యవేక్షిస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.
ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటే రోటీ తినండి.. లేకుంటే బుల్లెట్ ఉందని పాకిస్థాన్‌ను ప్రధాని మోడీ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి సోమవారం గుజరాత్లో పర్యటించారు.
Jaishankar: పాకిస్తాన్‌తో ఇటీవల నెలకున్న ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సభ్యులకు వివరించారు. ఉద్రిక్తతల గురించి విదేశాలకు చాలా సులభంగా వివరించిందని.. ‘‘వారు కాల్పులు జరుపుతారు, మేము కాల్పులు జరుపుతాము,