India vs Pakistan: పాకిస్తాన్ కు భారత్ మరో షాక్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్‌లోని హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై మోడీ సర్కార్ ప్రణాళికలు రెడీ చేస్తోందని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. అయితే, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాక్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఇక, సింధు, దాని ఉప నదులపై భారత్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ల నిర్మాణం కష్టంగా మారడంతో.. పాటు నీటి నిల్వ సామర్థ్యం పెంచడం కూడా సమస్యగా ఉండేది. కానీ, ఇప్పుడు దాయాది దేశంతో ఒప్పందాన్ని నిలిపివేయడంతో.. కొత్త ప్రాజెక్టులతో పాటు నీటి నిల్వను కూడా పెంచే ఛాన్స్ దొరికింది. అయితే, నిర్మాణ ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టుల్లో ఇప్పుడు ఎటువంటి మార్పులు చేయడం లేదన్నారు. ఎందుకంటే వీటికి సంబంధించిన సాంకేతిక అంశాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. మరికొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఉండటంతో.. వాటిల్లో విద్యుత్త్ ఉత్పత్తిని ఎక్కువగా చేసేందుకు నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి ప్లాన్ చేస్తున్నామని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పుకొచ్చారు.
Read Also: Muhammad Yunus: షేక్ హసీనాను అప్పగించమంటే మోడీ ఏమన్నారంటే..! యూనస్ కీలక వ్యాఖ్యలు
అయితే, ప్రస్తుతం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ జమ్మూ కాశ్మీర్‌లో నాలుగు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, ఇవి ఇంకా నిర్మాణ పనులను స్టార్ట్ చేయాల్సి ఉంది. వీటిల్లో సింధు నదిపై న్యూ గందర్బాల్ ప్రాజెక్టు, చీనాబ్‌పై కిర్తాయ్-2, సవల్‌కోట్, జీలంపై ఉరి-1,2 ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. కాగా, 1960 సెప్టెంబరులో సింధు, దాని ఉప నదుల జలాలను పంచుకోవడానికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు దీనిపై సంతకాలు చేశారు.