ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులను హతమార్చారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలను కూడా భారత్ ధ్వంసం చేసింది.
జమ్మూకాశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను అమిత్ షా పరామర్శించారు.
Rajnath Singh: 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘1971లో మన భారత నేవీ పాకిస్తాన్ రెండుగా విభజించింది, ఆపరేషన్ సిందూర్‌లో నావికాదళం తన పూర్తి బలాన్ని ప్రదర్శించి ఉంటే, పాకిస్తాన్ ఇప్పటికే రెండు కాదు, నాలుగు భాగాలుగా విడిపోయేది’’ అని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్ సిందూర్ కేవలం వార్మ్-అప్ మాత్రమే అని పాకిస్తాన్‌ని హెచ్చరించారు. పాక్ ఏదైనా మళ్లీ దుశ్చర్యకు
PM Modi: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాలు నిమిషాల్లోనే పాకిస్తాన్ లోని వైమానిక స్థావరాలను నాశనం చేశామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఇది న్యూ ఇండియా అని, భారత్ తన బలాన్ని ప్రదర్శించిందని ప్రధాని శుక్రవారం బీహార్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ అన్నారు. ఉగ్రవాద దాడి మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో తాను హామీ ఇచ్చానని, ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని చెప్పారు.
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధూ జలాలను ప్రస్తావిస్తూ, పాకిస్తాన్ నీటి సమస్యపై ఎప్పుడూ రాజీపడదని అన్నారు. ఎందుకంటే, దేశంలో 24 కోట్ల మంది ప్రజల ప్రాథమిక హక్కులతో ఇది ముడిపడి ఉందని చెప్పారు. గురువారం, పాకిస్తాన్‌లోని పలు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్, ప్రిన్సిపాల్స్, ఇతర ఉపాధ్యాయులు, విద్యావేత్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వం, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలు మరోసారి బహిర్గమయ్యాయి. భారత్ ఎంతో కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తుందని చెబుతోంది. తాజాగా, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని కసూర్ జిల్లాలో మే 28న జరిగిన భారత వ్యతిరేక ర్యాలీలో పంజాబ్ ప్రావిన్స్ మంత్రులతో లష్కరే తోయిబా ఉగ్రవాదులు వేదికను పంచుకున్నారు. పాకిస్తాన్ అణు పరీక్షలకు గుర్తుగా యూమ్-ఏ-తక్బీర్ కార్యక్రమంలో వీరంతా తమ భారత వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
R-37M missile: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు నెలకున్న నేపథ్యంలో, ఆల్ వెదర్ ఫ్రెండ్ రష్యా, భారత్‌కి డెడ్లీ మిస్సైల్‌ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే, రష్యా తన లేటెస్ట్ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ Su-57ని కూడా అందిస్తామని చెప్పింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు R-37M హైపర్ సోనిక్ లాంగ్ రేంజ్ ఎయిర్ టూ ఎయిర్ క్షిపణిని అందించేందుకు పుతిన్ ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ వద్ద ఉన్న Su-30MKI ఫైటర్ జెట్లకు ఈ క్షిపణులను అమర్చాలనే…
Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పుకుంటూ వస్తున్న దాయాది పాకిస్తాన్, ఒక్కొక్కటిగా నిజాలను చెబుతోంది. తాజాగా, పాకిస్తాన్ ప్రధాని భారత్ తమపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసిందని ఒప్పుకున్నారు. మే 9-10 రాత్రి భారత్ రావల్పిండిలోని ఎయిర్‌బేస్‌తో సహా కీలక సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసింది, తాము చర్య తీసుకునే సమయానికి ముందే దాడి జరిగిందని, పాకిస్తాన్ సైన్యం ఈ దాడుల్లో చిక్కుకుందని పాకిస్తాన్…
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వోద్యోగి షకుర్ ఖాన్‌ను బుధవారం రాత్రి జైసల్మేర్‌లో నిఘా అధికారుల బృందం అరెస్ట్ చేసింది. షకుర్ ఖాన్‌పై గత కొన్ని వారాలుగా దర్యాప్తు బృందాలు నిఘా పెట్టాయి. పాక్ దౌత్య కార్యాలయంతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామం అని మరో ఘటన రుజువు చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక టూరిస్టులను ముష్కరులు బలి తీసుకున్నారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా(ఎల్ఇటి) కమాండర్ సైఫుల్లా కసూరి పాకిస్తాన్లో దర్జాగా తిరుగుతున్నాడు. భారత వ్యతిరేఖ ర్యాలీలో ఉగ్రవాది సైఫుల్లా పాల్గొన్నాడు. బుధవారం పాకిస్తాన్లో జరిగిన ర్యాలీలో పాక్ రాజకీయ నాయకులు, ఉగ్రవాదులు ఒకే వేదికను పంచుకున్నారు.