S Jaishankar: పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తే భారత్ దానిని లక్ష్యంగా చేసుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. యూరప్ పర్యటనలో ఉన్న ఆయన ఫ్రాన్స్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్‌ని టార్గెట్ చేస్తూ హెచ్చరించారు. ‘‘వారు ఎక్కడ ఉన్నారో మాకు పట్టింపు లేదు. వారు పాకిస్తాన్‌లో ఉంటే, మేము పాకిస్తాన్‌లోకి వెళ్తాము’’ అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎన్ని ఫైటర్ జెట్స్‌ని కోల్పోయిందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ..‘‘ నాకు సంబంధించినంత వరకు రాఫెల్ ఎంత ప్రభావవంతంగా ఉంది అనేది స్పష్టంగా చెప్పాలంటే, పాకిస్తాన్ లోని వైమానిక స్థావరాల ధ్వంసమే రుజువు’’ అని అన్నారు.
Read Also: Ambati Rambabu: ఎవరిని అరెస్టు చేసినా.. 2 నెలలు బయటకు రాకుండా చేస్తున్నారు..!
ఉగ్రవాదులు భారతదేశంపై దాడి చేస్తే, పాకిస్తాన్ తో సహా వారు ఎక్కడ ఉన్నా వేటాడుతాము అని లే ఫిగారోకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జైశంకర్ అన్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం కొనసాగుతున్నంత వరకు మేము ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంటామని, తమ ఆత్మరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఇది తమ ప్రజల ప్రాథమిక విధి అని అన్నారు. మే 7 నుంచి 10 మధ్య జరిగిన భారత దాడుల కారణంగానే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం పట్టుబట్టిందని జైశంకర్ చెప్పారు. మే 10వ తేదీ తెల్లవారుజామున 8 పాకిస్థానీ వైమానిక స్థావరాలపై దాడులు చేశామని, ఈ ఒక్క కారణంగానే ఇరు దేశాల మద్య పోరాటం ఆగిపోయిందని చెప్పారు.