US Invited Pak Army Chief: భారత్, పాకిస్తాన్ విషయంలో మరోసారి తన వక్రబుద్దిని బయట పెట్టింది అగ్రరాజ్యం అమెరికా. తమకు ఇండియా మిత్ర దేశం అంటూనే.. వెనుక మాత్రం గోతులు తీసేందుకు భారీ ప్లాన్ వేసింది. ఓవైపు ఉగ్రవాదంపై భారత్ ప్రపంచ దేశాలకు తెలియజేస్తుంటే.. యూఎస్ మాత్రం మాత్రం పాక్ కి మద్దతుగా నిలుస్తుంది.. పాకిస్తాన్‌పై అమెరికా అధికారి ప్రశంసలు కురిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also: Delhi Red Alert: ఢిల్లీని హడలెత్తిస్తోన్న ఉష్ణోగ్రతలు.. 52 డిగ్రీలు నమోదు
అయితే, అమెరికా జనరల్ మైఖేల్ కురిల్లా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న పోరాటంలో పాకిస్తాన్ అసాధారణ పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు. అలాగే, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాత్ర గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. అందుకే అమెరికా భారత్‌తో పాటు పాకిస్తాన్‌తో మంచి సంబంధాలను కలిగి ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా, భారత్‌తో యూఎస్ కు సంబంధం ఉన్నంత మాత్రాన పాక్ తో రిలేషన్ షిప్స్ ఉండకూడదని తాను అనుకోవడం లేదన్నారు. తమకు భారత్, పాకిస్తాన్ రెండు దేశాలతోనూ స్నేహం అవసరమని తెలిపాడు. ఇక, అతడి వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.
Read Also: America vs Iran: ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. సైన్యాన్ని వెనక్కి పిలిచిన ట్రంప్
ఇక, పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్‌ను ఏకాకిని చేసేందుకు భారత్ ప్రపంచ దేశాల సపోర్టు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అమెరికా కమాండర్ ఈ వ్యాఖ్యలు చేయడం భారత్‌ను ఆగ్రహానికి గురి చేసే ఛాన్స్ ఉంది. ఇది వాణిజ్యపరమైన ఎదురుదెబ్బ అవునో కాదో చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నించింది. అమెరికా ప్రవర్తిస్తున్న తీరు సరికాదంటూ పలువురు సీరియస్ అవుతున్నారు. ఈ పరిణామాలతో భారత్ అప్రమత్తం అయిందని సమాచారం.
Read Also: Lok Sabha Elections: నారీమణులకు కేంద్రం గుడ్‌న్యూస్..! వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో..!
కాగా, ఈ నెల 14వ తేదీన జరిగే 250వ అమెరికా ఆర్మీ వార్షికోత్సవానికి పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు యూఎస్ ఆహ్వానం అందజేసింది. అలాగే, ఆ రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా కావడంతో.. ఈ రోజు అసిఫ్ వాషింగ్టన్‌కు చేరుకుంటారని తెలుస్తుంది. అయితే, అమెరికా ఆర్మీ డే వేడుకలకు పాక్ ఛీఫ్‌ను పిలవడం వెనుక యూఎస్ ఉద్దేశమేంటనే చర్చ కొనసాగుతుంది. మొన్నటి వరకు తమ సపోర్టు భారత్‌కే అని చెప్పిన అగ్రరాజ్యం ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటో అనేది తెలియరావడం లేదు. అయితే, చైనా, పాక్ మధ్య పెరుగుతున్న ఆర్థిక, సైనిక సంబంధాలను దెబ్బ తీయాలని అమెరికా భావిస్తుందా లేకపోతే భారత్ ను కట్టడి చేయడానికి పాక్ తో దోస్తీకి అగ్రరాజ్యం ప్లాన్ చేస్తుందా అనేది ఇప్పటికి రహస్యంగానే ఉంది.
"Pakistan has been a phenomenal counter-terrorism partner for America," argues General Michael Kurilla pic.twitter.com/VOzTy8vVli
— Shashank Mattoo (@MattooShashank) June 11, 2025
"Ties with India cannot cost ties with Pakistan"
General Michael Kurilla commander of United States Central Command.Seems the news about Indian Missiles ripping US’s Fissile materials and Nuclear Warhead at Nur Khan Air Base is proving to be True. pic.twitter.com/Ffp7lVdltS
— BRADDY (@braddy_Codie05) June 11, 2025