NBW Against Anantha Lakshmi Durga: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ.. పరారీలో లక్ష్మీ దుర్గ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBW Against Anantha Lakshmi Durga: తూర్పు గోదావరి జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య అనంత లక్ష్మీ దుర్గపై జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి Uma Sunanda ఈ ఆదేశాలు జారీ చేశారు. కేసుకు సంబంధించి కోర్టు ముందు హాజరు కాకపోవడంతో అనంత లక్ష్మీ దుర్గపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అనంత లక్ష్మీ దుర్గ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
Read Also: Mla’s Defection : ఆ ఎమ్మెల్యేలకు ఊరట.. కడియం, దానం భవితవ్యంపై ఉత్కంఠ.!
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
కాగా, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఆయన భార్య అనంత లక్ష్మీదుర్గ అలియాస్ రోజా పాత్ర ఉందని పోలీసులు పేర్కొంటూ అనుబంధ చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసిన విషయం విదితమే.. దీంతో ఆమెను ఈ కేసులో ఏ–2గా చేర్చిన పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. డ్రైవర్ సుబ్రమణ్యం హత్యలో అనంత లక్ష్మీదుర్గ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు కీలక ఆధారాలను కూడా అనుబంధ చార్జిషీట్‌కు జత చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ డ్రైవర్ హత్య కేసు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ప్రారంభ దర్యాప్తులో అనంతబాబును మాత్రమే ప్రధాన నిందితుడిగా చేర్చినప్పటికీ, తర్వాతి దర్యాప్తులో ఆయన భార్య పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ సమయంలో ఆమె పేరు ఎఫ్‌ఐఆర్ లేదా చార్జిషీట్‌లో చేర్చలేదు. ఇప్పుడు అనంత లక్ష్మీదుర్గపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!