ఇరాన్‌పై ఇజ్రాయెల్ అణు దాడి చేస్తే.. పాకిస్థాన్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌పై అణు దాడి చేస్తుందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లో సీనియర్ అధికారి, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు మొహ్సేన్ రెజాయ్ హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పాకిస్థాన్ మాకు మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. అంతేకాకుండా టెహ్రాన్ దగ్గర ప్రపంచానికి తెలియని శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
గత నాలుగు రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధంలో ఇరాన్‌లో 230 మంది, ఇజ్రాయెల్‌లో 18 మంది చనిపోయారు. అయితే ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడుతోంది. అయితే ఇజ్రాయెల్ అణు బాంబు దాడులు చేసేందుకు సిద్ధపడుతుందన్న ఆ వార్తల నేపథ్యంలో.. అదే జరిగితే తమ పక్షాన పాకిస్థాన్ రంగంలోకి దిగుతుందని రెజాయ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Israel-Iran War: ఇరాన్‌లో భారతీయులకు ఇక్కట్లు.. భారత్‌కు టెహ్రాన్ ఏం సూచించందంటే..!
ICAN (ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్) ప్రకారం.. ప్రస్తుతం అణ్వాయుధాలు కలిగి ఉన్న తొమ్మిది దేశాల్లో ఇజ్రాయెల్, పాకిస్థాన్ ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్‌కు పాకిస్థాన్ మద్దతు ప్రకటించింది. ముస్లిం ప్రపంచం ఐక్యంగా ఉండాలని.. ఇరాన్‌కు మద్దతు ఇవ్వాలని పాకిస్థాన్ పిలుపునిచ్చింది. అయితే అణు దాడులపై పాకిస్థాన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
ఇది కూడా చదవండి: Kondapalli Municipal Election: ఎక్స్ అఫిషియో ఓటు ఓకే.. కొండపల్లి చైర్మన్ పీఠం టీడీపీదే!
ఇదిలా ఉంటే అమెరికాపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. అమరికా సాయుధ దళాలు పూర్తి బలం, శక్తిని మునుపెన్నడూ చూడని రీతిలో ఇరాన్‌పైకి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. రష్యా, చైనాతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్ర స్థానంలో ఉంది. భారత్, ఉత్తర కొరియాకు కూడా అణ్వాయుధాలు ఉన్నాయి.