PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ద్వీప దేశం సైప్రస్ చేసుకున్నారు. మోడీ లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ ప్రోటోకాల్ పక్కనపెట్టి, స్వయంగా ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు, ప్రధాని జూన్ 15-16 తేదీల్లో సైప్రస్‌లో అధికారిక పర్యటన చేస్తున్నారు. జూన్ 16-17 తేదీల్లో కెనడాలో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి వెళ్తున్న ప్రధాని మోడీ, మార్గం మధ్యలో సైప్రస్‌లో పర్యటిస్తున్నారు. కెనడా పర్యటన తర్వాత జూన్ 18న క్రొయేషియా దేశంలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతుంది.
టర్కీకి సమీపంగా ఉండే ఈ చిన్న దేశానికి ప్రధాని మోడీ పర్యటనకు వెళ్లడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సైప్రస్‌కి శత్రువు టర్కీ. టర్కీ మన శత్రువు పాకిస్తాన్‌కి ప్రతీ విషయంలోనూ మద్దతుగా నిలుస్తోంది. ఇలా శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నీతిలో భాగంగానే భారత్-సైప్రస్‌తో మంచి సంబంధాలను కొనసాగిస్తోంది. టర్కీ-పాకిస్తాన్‌ని ఎదుర్కోవడంలో మధ్యదరా సముద్రంలోని సైప్రస్ వ్యూహాత్మక ప్రాధాన్యతను భారత్ గుర్తించింది. ఇది ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్(IMEC) కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది.
Read Also: Oil Discovery: జాక్‌పాట్ కొట్టిన భారత్.. అండమాన్ సముద్రంలో భారీగా ఆయిల్ నిల్వలు..
దీనికి తోడు 2026లో సైప్రస్ యురోపియన్ యూనియన్ (ఈయూ) కౌన్సిల్ రొటేషనల్ అధ్యక్ష పదవిని చేపడుతోంది. ఇది కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. 23 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధానిగా మోడీ సైప్రస్ పర్యటనకు వెళ్లారు. ఇది భారత్-ఈయూ సహకారానికి మార్గం సుగమం చేస్తుంది. టర్కీతో ప్రాదేశిక జలాల విషయంలో సైప్రస్ టర్కీకి తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ని సైప్రస్ కూడా మంచి మిత్రుడుగా చూస్తోంది.
తూర్పు మధ్యధరా సహజ వాయువు అన్వేషణలో సైప్రస్ కీలక పాత్ర పోషిస్తుంది, టర్కీ డ్రిల్లింగ్ కార్యకలాపాల కారణంగా ప్రాంతీయ ఉద్రిక్తత ఏర్పడుతోంది. టర్కీ ఆధిపత్య ధోరణిని సైప్రస్, గ్రీస్ వ్యతిరేకిస్తున్నాయి. ఈ రెండు దేశాలతో పాటు టర్కీతో సరిహద్దు కలిగిన ఆర్మేనియాతో భారత్ సంబంధాలు ఇటీవల కాలంలో మెరుగయ్యాయి.
#WATCH | Cyprus: Prime Minister Narendra Modi reaches Larnaca International Airport, received by President of Cyprus, Nikos Christodoulides.
At the invitation of the President of Cyprus, Nikos Christodoulides, PM Modi is paying an official visit to Cyprus from 15-16 June. PM… pic.twitter.com/LEx8u9yPID
— ANI (@ANI) June 15, 2025