Pakistan: ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ జాతీయ ఎయిర్ లైన్స్ ‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ)’ తమ పైలెట్లు, క్యాబిన్ క్రూకి కీలక ఆదేశాలు జారీ చేసింది. రంజాన్ సమయంలో ఉపవాసాలు ఉన్న పైలెట్లు, విమాన సిబ్బంది విమానాల్లో విధులు నిర్వర్తించొద్దని చెప్పింది. విమానంలో ప్రయాణిస్తు్న్నవారు,
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో, జనరల్ జియా ఉల్ హక్ సైనిక పాలనలో ఉరితీయబడ్డాడు. రాజకీయ నాయకుడి హత్యకు కుట్ర చేశాడనే అభియోగాలపై 1979లో లాహోర్ హైకోర్టు భుట్టోకి మరణశిక్ష విధించింది. సైనిక తిరుగుబాటుకు పాల్పడి భుట్టోని అధికారంలో నుంచి దించిన జియా ఉల్ హక్ అతనిపై అవినీతి ఆరోపణలు, ఇతర అభియోగాలు మోపాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పాకిస్తాన్ న్యాయవ్యవస్థ సరిగా పనిచేయలేదనే భావన ఉంది.
Pakistan : పాకిస్తాన్ దురాగతాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్లో నివసిస్తున్న మైనారిటీలకు ఆ దేశం నరకం చూపిస్తోంది. ప్రతిరోజూ హిందువులు, మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Danish Kaneria: పాకిస్తాన్ మాజీ స్టార్ క్రికెటర్ డానిష్ కనేరియా భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు మద్దతు తెలిపారు. 2015కి ముందు భారత్కి తరలివెళ్లిన శరణార్థులకు సంబంధించి, సీఏఏ నిబంధనలు పాకిస్తానీ హిందువులందరికీ మంచివని కనేరియా ప్రశంసించారు. పాకిస్తానీ హిందువులు ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకోగలుగుతారు అని కనేరియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సీఏఏని అమలు చేసినందుకు భారత ప్రధాని నరేంద్రమోడీకి, హోమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు.
CAA: కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని నోటిఫై చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని ఇచ్చే ఈ చట్టాన్ని 2019లో పార్లమెంట్ ఆమోదించింది. అయితే, సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కేంద్రం చట్టాన్ని అమలు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. పలు రాజకీయ పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మాత్రం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తోంది.
పాకిస్తాన్తో మాట్లాడటానికి భారతదేశం ఎప్పుడూ తలుపులు మూసుకోలేదు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అయితే, ఇస్లామాబాద్ నుంచి న్యూ ఢిల్లీకి వచ్చిన చర్చలు జరిపితే ఇది సాధ్యం అవుతుందని తెలిపారు.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన మంత్రివర్గంలో చేర్చుకోవడానికి 19 మంది పేర్లను అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి సిఫార్సు చేశారు. మీడియా నివేదికల ప్రకారం, ఈ పేర్లను అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించినట్లయితే, వారు త్వరలో మంత్రిగా ప్రమాణం చేయవచ్చు.
Pakistan: తప్పిపోయిన తమ దేశ మత్స్యకారుల జాడను కొనుక్కోవడానికి దాయాది దేశం పాకిస్తాన్, భారత్ సాయాన్ని కోరుతోంది. సింధ్ ప్రావిన్స్ లోని కేతి బందర్ పోర్టు సమీపంలోని సముద్రంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంతో కనీసం 14 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. అయితే, వీరి ఆచూకీ తెలుసుకోవడానికి భారతదేశం సాయాన్ని కోరాలని పాకిస్తాన్ చట్టసభ సభ్యులు ప్రధాని మంత్రి షెహబాజ్ షరీఫ్ని బలవంతం చేస్తున్నారు.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్లో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ పేలుడులో కనీసం ఇద్దరు మరణించినట్లుగా అదికారులు వెల్లడించారు. పెషావర్లోని బోర్డ్ జబార్ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని లేడీ రీడింగ్ హాస్పిటల్కి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
Asif Ali Zardari: పాకిస్తాన్ అధ్యక్షుడిగా రెండోసారి ఆసిఫ్ అలీ జర్దారీ శనివారం ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో భర్తగా పేరు సంపాదించుకున్న జర్దారీ, 2007లో ఆమె బాంబు దాడిలో మరణించిన తర్వాత పాకిస్తాన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాడు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చీఫ్గా ఉన్న ఆయన భార్య మరణం తర్వాత వచ్చిన సానుభూతితో 2008-13 వరకు పాక్కి అధ్యక్షుడిగా పనిచేశారు.