Pakistan: ‘‘బంగ్లాదేశ్‌ని చూస్తుంటే సిగ్గుగా ఉంది’’.. పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి సాధించాలంటే ముందుగా రాజకీయ స్థిరత్వంపై దృష్టి పెట్టాలని పాకిస్తాన్ వ్యాపారులు షెహబాజ్ షరీఫ్‌ని కోరారు. భారత్‌తో వాణిజ్య చర్చలు ప్రారంభించాలని సూచించారు. బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధిపై వ్యాఖ్యానించిన పాక్ ప్రధాని.. ఒకప్పుడు పాకిస్తాన్‌లో భాగం ఉన్న ఈస్ట్ పాకిస్తాన్(ప్రస్తుత బంగ్లాదేశ్) ఆనాడు దేశంపై భారంగా భావిస్తే, ఇప్పుడు పారిశ్రామిక వృద్ధిలో అద్భుతమైన పురోగతి సాధించిన విసయాన్ని గుర్తించాలని అన్నారు.
Read Also: Retirement: 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ వ్యాపారవేత్తలతో కరాచీలో సమావేశమయ్యారు. ప్రస్తుత పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసని, బంగ్లాదేశ్ అభివృద్ధిని చూస్తుంటే సిగ్గు పడాల్సి వస్తోందని పాక్ పీఎం అన్నారు. కరాచీలోని సింధ్ సీఎం హౌజ్‌లో బుధవారం జరిగిన సమావేశంలో వ్యాపార వర్గాలతో కలిసి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు మార్గాలను అణ్వేషించారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపుతున్న ప్రధానిని వ్యాపారులు ప్రశంసించారు. అయితే, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో దేశంలో రాజకీయ అస్థిరతపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముందు రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావాలని ప్రధానికి వ్యాపారులు సూచించారు. భారత్‌తో వాణిజ్య చర్చలు ప్రారంభించాలని వారంతా కోరారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్, భారత్‌తో వ్యాపార-వాణిజ్య సంబంధాలను నిలిపేసింది. దీంతో పాకిస్తాన్ ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఆ సమయంలో పాక్ భారత రాయబారిని బహిష్కరించింది. భారత్‌తో ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలను కూడా తెంచుకుంది.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!