గత నెలలో బెంగళూరు కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వారి గురించి కీలకమైన అంశాలపై ఆరా తీస్తున్నారు. ‘కల్నల్’ అనేది ఓ వ్యక్తి పేరు కాదు, కోడ్ నేమ్ అని తేలింది. ఈ ఉగ్రవాది (కల్నల్)కి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో సంబంధాలు ఉండవచ్చని దర్యాప్తు సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసులో కీలక సూత్రదారిగా ఆరోపించిన అబ్దుల్ మతిన్ తాహా, ముసావిర్ హుస్సేన్ షాజీబ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
Read Also: World Earth Day 2024: ఈ ఏడాది ప్రపంచ ధరిత్రి దినోత్సవం థీమ్ ఏంటో తెలుసా?
కాగా, చిన్న చిన్న మాడ్యూళ్లను రూపొందించడం ద్వారా ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపు ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించడంలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐ సహకారాన్ని తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. ISI గతంలో IS కార్యకర్తలుగా ఉంటూ.. భారతదేశంలో టెర్రర్ మాడ్యూల్స్‌ను విస్తరించినట్లు సమాచారం. అక్టోబరులో ఢిల్లీలో ఐఎస్ఐకు సంబంధించిన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా ఈ విషయం వెల్లడైంది. కాగా, వీరికి క్రిప్టో- వాలెట్ల ద్వారా డబ్బు పంపడమే కాకుండా.. దక్షిణ భారతదేశంలోని అనేక మంది యువకులను మతపరమైన అంశాలతో పాటు హిందూ నాయకులు, ప్రముఖ ప్రదేశాలపై దాడులకు ప్రేరేపించడం వెనుక అబ్దుల్ మతిన్ తాహా కీలక పాత్ర పోషిస్తున్నాడని దర్యాప్తు ఏజెన్సీకి చెందిన ఒక అధికారి తెలిపారు.