Jasprit Bumrah Records: ‘వన్స్ ఇన్ ఏ జనరేషన్ బౌలర్’.. మరీ ఇన్ని అరుదైన రికార్డులా బుమ్రా?
- ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్‌గా బుమ్రా
- టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన బూమ్ బూమ్
- బుమ్రా ఖాతాలో ఇన్ని రికార్డులు ఉన్నాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్, అద్భుతమైన యార్కర్లు, కీలక సమయాల్లో వికెట్లు తీసే సామర్థ్యంతో బుమ్రా ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. మూడు ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన చేస్తూ.. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. ఈ క్రమంలోనే ‘వన్స్ ఇన్ ఏ జనరేషన్ బౌలర్’గా పేరుగాంచాడు. బుమ్రా నెలకొల్పిన అరుదైన రికార్డులు ఏంటో ఓసారి చూద్దాం.
జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో ఐసీసీ నంబర్-1 ర్యాంకింగ్ అందుకున్న ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అతని బౌలింగ్ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా 2024 టీ20 వరల్డ్ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు గెలుచుకున్నాడు. 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచి భారత జట్టు విజయానికి కీలకంగా మారాడు. ఈ రెండు మెగా టోర్నీలలో ఎన్నో మ్యాచ్‌లలో కీలక సమయంలో బుమ్రా అద్భుత ఓవర్లు వేసి టీమిండియాకు విజయాలు అందించాడు.
Also Read
- ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
టెస్ట్ క్రికెట్‌లో కూడా జస్ప్రీత్ బుమ్రా తన ప్రతిభను చాటుకున్నాడు. ఇంగ్లండ్‌లో 2021లో జరిగిన టెస్ట్ సిరీస్, దక్షిణాఫ్రికాలో 2022 టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియాలో 2025 టెస్ట్ సిరీస్‌లలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు అందుకున్నాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ సగటు, టెస్ట్ క్రికెట్‌లో కూడా అద్భుతమైన బౌలింగ్ సగటుతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. టీ20 వరల్డ్ కప్‌లలో కూడా బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మెగా టోర్నీలో పేసర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అలాగే నాకౌట్ మ్యాచ్‌లలో కూడా అత్యధిక వికెట్లు సాధించిన పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ఎకానమీ రేట్ కూడా అతని ఖాతాలోనే ఉంది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కూడా పేసర్లలో అత్యుత్తమ ఎకానమీ రేట్ కలిగిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
జస్ప్రీత్ బుమ్రా కెరీర్‌లో మరెన్నో ప్రత్యేక ఘనతలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించడం, ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించడం వంటి అరుదైన రికార్డులు కూడా అతని పేరుపై ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు సాధించిన ఏకైక భారతీయ బౌలర్ కూడా మనోడే. ప్రత్యేకంగా SENA దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో ఆసియా బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు కూడా బుమ్రా పేరిట ఉంది. అలాగే ఈ దేశాల్లో ఆసియా బౌలర్లలో అత్యుత్తమ బౌలింగ్ సగటు కలిగిన బౌలర్‌గా నిలిచాడు. SENA టెస్ట్‌లలో అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలలో కూడా సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా మూడు ఫార్మాట్లలో 50కిపైగా వికెట్లు తీసి 25 కంటే తక్కువ బౌలింగ్ సగటు కలిగిన ఏకైక బౌలర్‌గా బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. 2024లో అతను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను కూడా అందుకున్నాడు. ఇలా తన అసాధారణ బౌలింగ్‌తో బుమ్రా ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించున్నాడు.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?