పాకిస్థాన్ లో క్లిష్ట పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒక వైపు తాలిబన్లతో యుద్ధ వాతావరణం నెలకొంది. దేశంలో నిరంతరం జరుగుతున్న ఉగ్రదాడుల కారణంగా ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.
పాకిస్థాన్ మార్కెట్లలో కూడా భారత్‌తో మెరుగైన సంబంధాల కోసం డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. ఇటీవల, పాకిస్తాన్ కొత్త ప్రభుత్వం భారతదేశంతో వాణిజ్యాన్ని పునః ప్రారంభించవచ్చని సూచించింది.
Pakistan: తీవ్ర ఆర్థిక సంక్షోభం, అప్పుల్లో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్తాన్, భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి చూస్తోంది. 2019లో జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ ఏకపక్షంగా భారత్‌తో వాణిజ్య, వ్యాపార సంబంధాలను నిలిపేసుకుంటున్నట్లు ప్రకటించింది.
పాకిస్థాన్ ఒక పరిశ్రమగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఉగ్రవాద సమస్యను విస్మరించడానికి భారత్ ఏమాత్రం అనుకూలంగా లేదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం అన్నారు
పాకిస్తాన్ మూడు వైపుల నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ తన పశ్చిమ సరిహద్దులో భారతదేశంతో శత్రుత్వంతో ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబాన్ ఉత్తర సరిహద్దులో ఆయుధాలతో నిలబడి ఉంది. ఈశాన్య సరిహద్దులో ఇరాన్‌తో పాకిస్థాన్ శత్రుత్వం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) కన్నుమూశారు. అహ్మద్ 1958-73 మధ్య పాక్ తరఫున 41 టెస్టులు ఆడారు. అందులో 5 సెంచరీలు, 16 అర్ధ శతకాలతో 2991 పరుగులు చేశారు. అంతేకాకుండా.. అహ్మద్ రైట్ ఆర్మ్ స్పిన్నర్ కాగా.. 22 వికెట్లు కూడా తీశారు. ఇదిలా ఉంటే.. అహ్మద్ చేసిన 5 శతకాలలో మూడు ఇండియాపైనే నమోదు చేశారు.
పాకిస్థాన్ ఇస్లాం పేరుతో గల్ఫ్ దేశాలతో సంబంధాలను కొనసాగిస్తోంది. కానీ పాకిస్థానీల చర్యలు మాత్రం మధ్యప్రాచ్యంలోని దేశాలు వారితో కేవలం బలవంతంతోనే సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ పర్యాటకం వైపు దూసుకుపోతున్న యూఏఈ వంటి దేశాలు కూడా పాకిస్థానీలను స్వాగతించడానికి సిద్ధంగా లేవు.
Pakistan: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్న గ్వాదర్ పోర్టులో కాల్పులు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పాక్ స్థానిక మీడియా బుధవారం నివేదించింది. భద్రతా సిబ్బంది ప్రతిదాడుల్లో ఇద్దరు దుండగులు మరణించినట్లు తెలుస్తోంది. గ్వాదర్ పోర్టు అరేబియా సముద్రంలో హర్మూజ్ జలసంధికి సమీపంలో నిర్మితమవుతోంది. పాకిస్తాన్ మిత్రదేశం చైనా ఈ పోర్టును నిర్మిస్తోంది. మిడిల్ ఈస్ట్ నుంచి చమురు రవాణాకు ఈ మార్గం కీలకంగా ఉంది. అయతే, ఈ కాల్పుల గురించి గ్వాదర్ డిప్యూటీ కమిషనర్,…
Pakistan: పాకిస్తాన్లో బొగ్గు గని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది కార్మికులు చనిపోయారు. దక్షిణ పాకిస్తాన్ ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కూలిపోయిన బొగ్గు గని నుంచి బుధవారం మరో 10 మంది మైనర్ల మృతదేహాలను బయటకు తీశారు.