Pakistan: పాకిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో మహ్మద్ ప్రవక్త, ఖురాన్, ఇస్లాంని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే దాన్ని దైవదూషణగా పరిగణిస్తుంటారు. దైవదూషణకు పాల్పడిన వ్యక్తులకు తీవ్రమైన శిక్షలు ఉంటాయి. వాట్సాప్ సందేశాల ద్వారా దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 ఏళ్ల విద్యార్థికి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. మరో 17 ఏళ్ల యువకుడికి జీవిత ఖైదు విధించింది. మహ్మద్ ప్రవక్త, అతని భార్యలను గురించి కించపరిచే పదాలను కలిగి ఉన్న ఫోటోలు,
Karnataka: ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ కార్యకర్త ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాలు చేయడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో రచ్చకు కారణమయ్యాయి. అయితే, తాజాగా ఈ వివాదంపై కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కేఎన్ రాజన్న స్పందించారు. అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసేవారిని కాల్చిచంపాలని శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత సయ్యద్ నసీర్ హుస్సేన్ విజయం సాధించిన తర్వాత అతని మద్దతుదారులు కర్ణాటక అసెంబ్లీలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు…
Sardar Ramesh Singh Arora: ముస్లిం రిపబ్లిక్గా ఉన్న పాకిస్తాన్ దేశంలో ఒక హిందూ, సిక్కు, క్రిస్టియన్ మైనారిటీలు అత్యున్నత పదవులను ఆక్రమించడం చాలా అరుదు. తాజాగా సర్దార్ రమేష్ సింగ్ అరోరా అనే వ్యక్తి పాకిస్తాన్ దేశంలోనే తొలి సిక్కు మంత్రిగా ఎన్నికయ్యారు. పంజాబ్ ప్రావిన్స్లో మైనారిటీ వ్యవహాల మంత్రిగా పనిచేయనున్నారు. రమేష్ సింగ్ అరోరా పాకిస్తాన్ మైనారిటీ నాయకుల్లో శక్తివంతమైన నేతగా ఉన్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N)…
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పనామా పత్రాల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారులు (Pakistan Nawaz sharifs Sons) న్యాయస్థానం ముందు లొంగిపోనున్నారు.
పాకిస్థాన్లో జరిగే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు 62 మంది హిందువులు బుధవారం భారత్ నుంచి వాఘా సరిహద్దు మీదుగా లాహోర్ చేరుకున్నారు. మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి బుధవారం నాడు మొత్తం 62 మంది హిందూ యాత్రికులు లాహోర్ చేరుకున్నారని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీపీబీ) ప్రతినిధి అమీర్ హష్మీ తెలిపారు.
పాకిస్థాన్ (Pakistan), ఆప్ఘనిస్థాన్ను భారీ హిమపాతం (Snowfall) ప్రజలను హడలెత్తించింది. ఇటీవల కురిసిన మంచు.. వడగళ్ల వానతో పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను కోల్పోయారు.
Pakistan Boxer steals money from teammate bag in Italy: విదేశాలకు వెళ్లిన ఓ పాకిస్థాన్ బాక్సర్ ఎవరూ ఊహించని పని చేశాడు. సహచర క్రీడాకారిణి బ్యాగ్ నుండి డబ్బు దొంగిలించి.. అక్కడినుంచి పరార్ అయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ఇటలీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లామని, ఈ ఘటనపై పోలీసు నివేదికను కూడా దాఖలు చేశామని ఫెడరేషన్ సీనియర్ అధికారి…
భారత్లో నిరుద్యోగం పాకిస్థాన్లో కంటే ఎక్కువగా ఉందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం ఎదురుదాడి చేసింది. దీనితో పాటు, పొరుగు దేశానికి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తుందనే ప్రశ్న కూడా ఆ పార్టీ లేవనెత్తింది.
Pakistan : సుదీర్ఘ రాజకీయ సంక్షోభం తర్వాత ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ 24వ ప్రధాని అయ్యారు. పీటీఐ, సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ ప్రతిపక్ష అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్ను ఓడించి షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
Pakistan: తీవ్ర రుణ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని వివరించారు కొత్తగా ఎన్నికైన ప్రధాని షెహబాజ్ షరీఫ్. జాతీయ అసెంబ్లీని నడిపేందుకు అప్పులు తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చి 2030 నాటికి జీ-20 సభ్యత్వాన్ని సాధించేలా చేస్తానని ప్రమాణం చేశారు.