IPL 2026: క్రికెట్ ఫాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. ఫస్ట్ మ్యాచ్‌లో కీలక మార్పు.. ఈ రెండు టీమ్‌ల మధ్యే తొలి పోరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Schedule: క్రికెట్ అభిమానులకు కిక్ ఎక్కిచ్చే న్యూస్ వచ్చేసింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ ముగిసింది. టీమిండియా మూడో సారి కప్పును కైవసం చేసుకుంది. ఇక తాజాగా ఐపీఎల్‌కి సంబంధించిన అప్డెట్ వచ్చేసింది. మేనేజ్‌మెంట్ వర్గాల సమాచారం ప్రకారం.. గత రెండ్రోజుల్లో ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది. మార్చి 13 నాటికి తొలి దశ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని క్రిక్ బజ్ కథనం తెలిపింది. అంతేకాదు.. తొలి పోరు చాలా ఆసక్తికరంగా ఉండనుంది. మార్చి 28న బెంగళూరు వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడే అవకాశం ఉంది. సాధారణంగా గత సీజన్ ఫైనలిస్టుల మధ్యే తొలి మ్యాచ్ ఉంటుంది.. కానీ పంజాబ్ కింగ్స్ (PBKS) – ఆర్‌సీబీ మ్యాచ్ కంటే, ‘సౌత్ ఇండియన్ డెర్బీ’గా పిలిచే ఆర్‌సీబీ-సీఎస్‌కే పోరుకే గ్లోబల్ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే, పాయింట్లు లేదా గత రికార్డులతో సంబంధం లేకుండా ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణాన్ని సృష్టించే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌తో లీగ్‌ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ తన తొలి మ్యాచ్‌ను మరుసటి రోజు అంటే, మార్చి 29న ముల్లాన్‌పూర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. అంతేకాదు.. ఈ నెల 15న ఢిల్లీలో కెప్టెన్ల ఫొటో షూట్ ఉంటుందట. 25న ముంబైలో కోచ్‌లు, కెప్టెన్లతో కీలక సమావేశం ఉండనుందని క్రిక్‌బజ్ నివేదిక స్పష్టం చేసింది.
READ MORE: Stock Market: ఒక్కరోజులోనే ఆశలు ఆవిరి.. భారీ నష్టాల్లో సూచీలు
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!