తాజాగా పాకిస్తాన్ దేశంలోని కరాచీ నగరంలో ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి శుక్రవారం పాల్పడ్డారు. ఈ దాడిలో ముఖ్యంగా విదేశీయులు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి జరిగింది. ఈ సంఘటనలో సూసైడ్ బాంబర్ తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు అక్కడ స్థానిక మీడియా తెలిపింది. లాంధీలోని మన్సేరా కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
Also read: Prakash Goud: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి ప్రకాశ్ గౌడ్
ఈ దాడి జరిగిన సమయంలో టార్గెట్ చేసుకున్న వాహనంలో మొత్తం ఐదుగురు విదేశీయులు ఉండగా.. వారందరూ తోటిలో ప్రాణాలను కాపాడుకున్నారు. విదేశీయులందరూ జపాన్ దేశానికి చెందినవారు.
Also read: T20 World Cup 2024: ఆ ఆటేంది.. కొంచెం యశస్వి జైస్వాల్‌తో మాట్లాడండి!
వ్యాన్ లక్ష్యంగా చేసుకొని ముష్కరులు బైక్ పై వచ్చి దాడి చేసినట్లు అక్కడి పోలీస్ వర్గాలు తెలిపాయి. మొదట దాడులలో భాగంగా కాల్పుల శబ్దం వినిపించడంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురయ్యారని., ఆపై బాంబు పేలినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడి నేపథ్యంలో భాగంగా అక్కడి అధికారులు దాడికి పాల్పడిన వారి నుండి గ్రైనేట్స్, అలాగే మరికొన్ని పేలుడు పదార్థాలకు సంబంధించిన ఒక బ్యాగ్ ను గుర్తించారు. ఈ దాడిలో భాగంగా ఓ ఉగ్రవాది తన శరీరానికి జాకెట్ బాంబ్, అలాగే గ్రానైట్ లను కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి బాంబు స్క్వాడ్ చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఇక మొత్తానికి దాడిలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు.