పాకిస్థాన్ టెహ్రీక్ ఈ ఇన్సాఫ్ వ్యవస్థాప అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలు అధికారులు, సిబ్బందిపై సంచలన ఆరోపణలను చేశారు. తన భార్య బుష్రా బీబీకి జైలులో టాయ్ లెట్ క్లీనర్ కలిపిన విషా ఆహారాన్ని ఇచ్చేవారిని పేర్కొన్నారు. అందుకే ఆమె కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్ తో బాధపడుతోందని ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఓ అవినీతి కేసు విచారణ కోసం శుక్రవారం నాడు రావుల్పిండీలోని అదియాలా జైల్లోని కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జైలు అధికారులు, సిబ్బందిపై విమర్శలు గుప్పించారు.
Read Also: Mainpuri Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి.. 24 మందికి గాయాలు
కాగా, జైలు అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. తన భార్యకు షౌకత్ ఖానుమ్ ఆసుపత్రి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఆసిమ్ యూసఫ్ ఇస్లామాబాద్ లోని షిఫా అంతర్జాతీయ హస్పటల్ లో వైద్య పరీక్షలు చేయాలని తెలిపింది.. కానీ, జైలు అధికారులు మాత్రం పాకిస్థాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్) లోనే వైద్య పరీక్షలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తన భార్య బుష్రా బీబీ జైలుకెళ్లేందుకు ప్రత్యక్ష కారణం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కారణమని ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేశారు. ఆయన నుంచి తన భార్య బుష్రా బీబీకి ముప్పు ఉందని తెలిపారు. ఆమెకు ఏమైనా జరిగితే అతడిని వదిలి పెట్టనని.. తాను ఎంతకైనా తెగిస్తానని ఇమ్రాన్ హెచ్చరించాడు.