Pakistan: పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 48 గంటల్లో కురిసిన వర్షాలకు ఆ దేశంలో 37 మంది మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు. పాక్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు కూలిపోవడం, కొండ చరియలు విరిగిపడటం జరుగుతోంది. ముఖ్యంగా వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ ఫఖ్తున్ఖ్వా ప్రావిన్స్ తవ్రంగా ప్రభావితం అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ ప్రావిన్సులో గురువారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షాల కారణంగా 27 మంది మరణించారని, వీరిలో…
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. భారత్‌లో నిరుద్యోగం పాకిస్తాన్, బంగ్లాదేశ్ కన్నా ఎక్కువగా ఉందని, భూటాన్ కన్నా వెనకబడి ఉన్నామని రాహుల్ గాంధీ అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో చిన్న వ్యాపారాలన్నింటికీ తీవ్ర విఘాతం కలిగిందని ఆయన దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత 40 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం చేరుకుందని, పాకిస్తాన్‌తో పోలిస్తే భారత్‌లో రెండింతల…
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని ఆ దేశంలోని చట్టసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సోషల్ మీడియ సైట్లపై బ్యాన్ విధించాలని సెనెట్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన సెనెటర్ బహ్రమంద్ టాంగీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఫేస్బుక్, టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి వాటిని నిషేధించాలని తీర్మానంలో కోరారు. మార్చి 11తో సెనేటర్‌గా పదవీకాలం ముగియబోతున్న తరుణంలో టాంగీ ఈ తీర్మానాన్ని తీసుకురావడం గమనార్హం.
Pakistan: అణు కార్యక్రమాలు, బాలిస్టిక్ క్షిపణుల నిర్మాణానికి దోహదపడే సరుకుతో పాకిస్తాన్ వెళ్తున్న ఓడను భారత అధికారులు ముంబైలోని నవషేవా పోర్టులో అడ్డుకున్నారు. ఈ సరకు చైనా నుంచి పాకిస్తాన్ లోని కరాచీకి వెళ్తున్నట్లు తేలింది. అయితే, దీనిపై పాకిస్తాన్ స్పందించింది. వాస్తవాలను తప్పుడుగా చూపిస్తోందని పాక్ విదేశంగా కార్యలయం ఆదివారం పేర్కొంది. జనవరి 23న చైనా నుంచి పాకిస్తాన్ వెళ్తున్న ఓడ CMA CGM అట్టిలాను ముంబైలోని నవా షెవా పోర్ట్‌లో నిలిపివేశారు. ఈ ఓడలో…
Shehbaz Sharif: దాయాది దేశం పాకిస్తాన్ ప్రధానిగా రెండోసారి షహజాబ్ షరీఫ్ ఎన్నికయ్యారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లింలీగ్-నవాజ్ పార్టీల ఉమ్మడి సర్కారుకు షహబాజ్ నాయకత్వం వహించనున్నారు. ఈ రోజు ప్రధానిని ఎన్నుకునేందుకు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశమైంది. మొత్తం 336 మంది సభ్యుల ఓట్లలో షహజాబ్ 201 ఓట్లు పొందారు. మరోవైపు జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చెందిన ఒమర్ అయూబ్ ఖాన్ కేవలం 92…
26/11 Mumbai Attack: 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తోయిబా(LeT) ఉగ్రసంస్థ టెర్రిరిస్ట్ ఆజం చీమా(70) పాకిస్తాన్లో మరణించినట్లు తెలుస్తోంది. 2008లో ముంబైపై ఉగ్రదాడిలో ఇతను కీలకంగా వ్యవహిరంచాడు. 70 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో గుండె పోటుతో మరనించాడు. లష్కరే తోయిబా సీనియర్ కమాండర్‌గా ఉన్న చీమా 26/11 ముంబై ఎటాక్స్, జూలై 2006లో ముంబైలో జరిగిన రైలు బాంబు పేలుళ్లలో కీలక నిందితుడు.
Nuclear Cargo: చైనా నుంచి పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్తున్న ఓ కార్గో నౌకను భారత అధికారలు ముంబై పోర్టులో అడ్డుకున్నారు. పాకిస్తాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల కోసం వినియోగించే సరకు ఉందనే అనునమానంతో ముంబై నవ షేవా నౌకాశ్రయంలో భారత అధికారులు శనివారం నిలిపేశారు. కస్టమ్స్, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా.. జనవరి 23న కరాచీకి వెళ్లే మార్గంలోని వెళ్తున్న సీఎంఎ సీజీఎం అట్టిలా నౌకను నిలిపేశారు. నౌకలో ఉన్న సరుకును పరిశీలించారు. ఇందులో కంప్యూటర్ న్యూమరికల్…
Pakistan: పాకిస్తాన్ కొత్త ప్రధానిని ఎన్నుకోవడానికి సిద్ధమైంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సహకారంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్‌ని ఆదివారం ప్రధానిగా ఎన్నుకోనున్నారు. మరోవైపు జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఒమర్ అయూబ్ ఖాన్ని తన ప్రధానమంత్రి అభ్యర్థిగా నామినేట్ చేసింది. అయితే, ఇతను గెలిచే పరిస్థితి లేదు.
India at UN: పాకిస్తాన్ తీరు మారడం లేదు. కుక్క తోక వంకర అనేలా ప్రపంచవేదికలపై భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటోంది. మరోసారి ఐక్యరాజ్యసమితి వేదికగా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తింది. అయితే, భారత్ అంతే ధీటుగా పాకిస్తాన్ తీరును ఎండగట్టింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో భారత్ ధీటుగా పాకిస్తాన్‌కి కౌంటర్ ఇచ్చింది. భారతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్‌కి ఎలాంటి అధికారం లేదని చెప్పింది.