OTT Updates: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ మూవీ తొలిరోజే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో నటించారు. మదర్ సెంటిమెంటుతో సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఈ మూవీలో శర్వాకు జోడీగా రీతూవర్మ హీరోయిన్‌గా నటించింది. డ్రీమ్ వారియర్…
OTT Updates: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ టాలీవుడ్‌లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ భారీ లాభాలను మూటగట్టుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 5న విడుదలైంది. తాజాగా ఓటీటీ అప్‌డేట్‌ను జీ5 ప్రకటించింది. దీపావళి కానుకగా ఈనెల 21న బింబిసార మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో థియేటర్లలో ఈ మూవీని…
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘F3’ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. F2 మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. మే 27న విడుదలైన F3 మూవీ ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్ అందించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ టాక్ సంపాదించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీని ముఖ్యంగా ఫ్యామిలీస్ చూసేందుకు థియేటర్లకు తరలివెళ్లారు. అలీ, రఘుబాబు కామెడీ కూడా…
కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ ‘విక్రమ్’. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’లో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. అలానే క్లయిమాక్స్ లో సూర్య ఎంట్రీ ఇచ్చి, మూవీ గ్రాఫ్ ను మరింత హైట్స్ కు తీసుకెళ్ళాడు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది.…
PellisandaD movie directed by Gowri Ronanki under the supervision of Dr K Raghavendra Rao, hit the theatres on October 15, 2021, and received positive reviews. The film performed well at the box office and made reasonable collections.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలై 50 రోజులు పూర్తయింది. ఇప్పటికే రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం 50 రోజులు దాటినా పలు చోట్ల ఇంకా ప్రదర్శితం అవుతోంది. ఈ మధ్య కాలంలో సినిమాలు రెండు, మూడు వారాల కంటే ఎక్కువగా థియేటర్లలో కనిపించడం లేదు. అలాంటిది 50 రోజులు దాటినా ఆర్.ఆర్.ఆర్ ఇంకా థియేటర్లలో ఆడుతోంది అంటే మాములు విషయం కాదు.…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగు ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లను ఈ సినిమా సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాను ఓటీటీలో చూడాలని మెగా, నందమూరి అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 సంస్థ కొనుగోలు చేసింది. హిందీ మినహా అన్ని…
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వలిమై’. ఫిబ్రవరి 24న విడుదలైన ఈ మూవీ తమిళనాడులో భారీ కలెక్షన్‌లను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ జీ5లో ఈనెల 25 నుంచి వలిమై స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు జీ5 సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. వలిమై సినిమాలో టాలీవుడ్…
సూపర్‌స్టార్ మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా తెలుగు తెరకు పరిచయమైన చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. పండగ సమయం కావడంతో బాక్సాఫీస్ దగ్గర బాగానే కాసులు కురిపించింది. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఈరోజు ప్రకటించింది. ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ…
తొలి సినిమా ‘ఉప్పెన’తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పంజా వైష్ణవ్‌తేజ్ నటించిన రెండో సినిమా ‘కొండపొలం’. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో వైష్ణవ్‌తేజ్‌కు జోడీగా రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఇంజనీరింగ్ చదివిన ఓ యువకుడు ఉద్యోగం…